Bomb Cyclone: అమెరికాలో ప్రాణం తీసిన ఒకే ఒక్క ఫొటో.. విషాదంలో రెండు కుటుంబాలు.. అసలేం జరిగిందంటే..

అసలేం జరిగింది..? అమెరికా ఆరిజోనాలో టూర్‌కు వెళ్లాయి 3 కుటుంబాలు. 11 మంది టూర్‌కు వెళ్లగా నారాయణ రావు ఫ్యామిలీ ఫొటో కోసం యత్నించింది. ఈ క్రమంలో..

Bomb Cyclone: అమెరికాలో ప్రాణం తీసిన ఒకే ఒక్క ఫొటో.. విషాదంలో రెండు కుటుంబాలు.. అసలేం జరిగిందంటే..
Gokul Medishetti
Follow us
Sanjay Kasula

|

Updated on: Dec 28, 2022 | 9:38 AM

ఒక ఫొటో. ఒకే ఒక్క ఫొటో. రెండు కుటుంబాల్లో విషాదంలో నింపింది. చిన్నారులను అనాథలుగా మార్చింది. ఫొటో కోసం వెళ్లిన నారాయణ రావు ఫ్యామిలీకి అదే చివరి క్షణమైంది. ఉపాధి కోసం అమెరికా బాటపట్టిన నారాయణ రావు ఫ్యామిలీకి మంచు రూపంలో మృత్యువు మంచుకొచ్చింది. అసలేం జరిగింది..? అమెరికా ఆరిజోనాలో టూర్‌కు వెళ్లాయి 3 కుటుంబాలు. 11 మంది టూర్‌కు వెళ్లగా నారాయణ రావు ఫ్యామిలీ ఫొటో కోసం యత్నించింది. ఈ క్రమంలో నారాయణ రావు కింద ఉన్న మంచు కరిగి లోపలికి వెళ్లిపోయాడు. అతన్ని రక్షించేందుకు భార్య.. ఆమెను కాపాడేందుకు మరో తెలుగు వ్యక్తి గోకుల్ మేడిశెట్టి వెళ్లారు. అక్కడున్న వారు రక్షించేందుకు యత్నించినా.. ప్రయత్నం సఫలీకృతం కాలేదు. ప్రమాదంలో నారాయణ రావు, ఆయన భార్య హరిత, విశాఖ జిల్లాకు చెందిన గోకుల్ ప్రాణాలు కోల్పోయారు.

నారాయణ, హరిత దంపతులు ఏడేళ్ల క్రితం అమెరికా వెళ్లారు. ఆరేళ్ల పాటు న్యూజెర్సీలో ఉన్న ఫ్యామిలీ గత ఏడాది డిసెంబర్‌లో ఆరిజోనాకు షిఫ్ట్ అయ్యింది. వీరికి ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. ఒకరు 11 ఏళ్లు, ఇంకొకరు ఏడేళ్ల కూతురు. మూడు, నాలుగు రోజుల్లో వారి మృతదేహాలను ఇండియాకు పంపేందుకు కంపెనీ ప్రయత్నిస్తోందని చెప్తున్నారు ఎన్ఆర్ఐ జ్యోతిరెడ్డి.

అమెరికాలో మంచు భయపెడుతోంది. అధికారిక లెక్కల ప్రకారం 66 మంది ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు. గడప దాటక పోవడం మంచిదన్న సంకేతాలు మారుమోగుతున్నాయి. అయినా వీరు జాలీ ట్రిప్‌కు వెళ్లి ప్రాణాలకు మీదకు తెచ్చుకున్నారు. టూర్‌కు వెళ్లిన వారంతా టీసీఎస్ ఉద్యోగులే.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే