PM Modi US Tour: కరోనా తర్వాత తొలి పర్యటన.. అగ్రరాజ్యానికి ఇవాళ ప్రధాని మోదీ పయనం

ప్రధాని నరేంద్రమోదీ ఇవాళ అమెరికా పర్యటనకు బయల్దేరుతున్నారు. ఆస్ట్రేలియా, జపాన్, ఇంకా యుఎస్‌లతో జరుగబోతోన్న

PM Modi US Tour: కరోనా తర్వాత తొలి పర్యటన.. అగ్రరాజ్యానికి ఇవాళ ప్రధాని మోదీ పయనం
Follow us

|

Updated on: Sep 22, 2021 | 7:15 AM

PM Modi US Tour – America – India: ప్రధాని నరేంద్రమోదీ ఇవాళ అమెరికా పర్యటనకు బయల్దేరుతున్నారు. ఆస్ట్రేలియా, జపాన్, ఇంకా యుఎస్‌లతో జరుగబోతోన్న మొదటి క్వాడ్ ఇన్ పర్సనల్ మీట్‌లో పాల్గొనడమే భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటన ప్రధాన ఉద్దేశ్యం. దీనితోపాటు, న్యూయార్క్‌లో జరిగే ఐరాస జనరల్ అసెంబ్లీలో కూడా ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. ఇక, ఈ పర్యటనలో అగ్రరాజ్య దేశాధ్యక్షుడు జో బైడెన్‌తో కూడా భారత ప్రధాని భేటీ అవుతారు.

ఎల్లుండి (24న) వైట్‌హౌస్‌లో ఇరుదేశాధినేతలు సమావేశమవుతారని అమెరికా అధ్యక్ష భవనం వెల్లడించింది. భారత – అమెరికా ద్వైపాక్షిక అంశాలపై ఇరువురు చర్చించనున్నారు. అలాగే, ఆఫ్ఘనిస్థాన్‌లోని ప్రస్తుత పరిస్థితులు, కొవిడ్ వ్యాక్సినేషన్ తదితర అంశాలపైనా చర్చించే అవకాశం ఉంది. కాగా, అదే రోజు అమెరికాలో జరగనున్న క్వాడ్ కూటమి సదస్సులో మోదీ, బైడెన్, జపాన్, ఆస్ట్రేలియా ప్రధానులు సుగా యోషిహిడే, స్కాట్ మోరిసన్ పాల్గొంటారు. గత ఆరునెలల్లో ప్రధాని మోడీ యొక్క మొదటి విదేశీ పర్యటన ఇదే కావడం విశేషం.

అంతేకాదు, అమెరికా అధ్యక్షుడిగా జో బిడెన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత మోదీ అమెరికాకు వెళుతుండటం ఇదే మొదటి సారి. ప్రధాని మోదీ వాషింగ్టన్‌లో దిగడంతో పర్యటన ప్రారంభమవుతుంది. రేపు ఉదయం, ప్రధాన మంత్రి మోదీ, అమెరికాలోని ప్రధాన CEO లతో సమావేశం కానున్నారు. ఇందులో భాగంగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆపిల్ చీఫ్ టిమ్ కుక్, ఇంకా యుఎస్ వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్‌తో సమావేశమయ్యే అవకాశం ఉంది.

Read also: Hyderabad: హైదరాబాద్‌లోని టోలీచౌకీలో దారుణ హత్య..