AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pete Buttigieg : అమెరికా కేబినెట్‌లోకి తొలి ట్రాన్స్​జెండర్.. రవాణా మంత్రిగా పీట్ బుట్టిగీగ్..

రవాణా శాఖ మంత్రిగా పీట్ బుట్టిగీగ్ నియామకాన్ని అమెరికా సెనేట్ ఓకే చెప్పింది. దీంతో కేబినెట్ మంత్రి పదవికి ఎంపికైన తొలి ట్రాన్స్​జెండర్​గా పీట్ చరిత్ర స‌ృష్టించారు. బైడెన్ కేబినెట్​లో ఏకైక మిలేనియల్​గానూ రికార్డుల్లోకి ఎక్కారు.  

Pete Buttigieg : అమెరికా కేబినెట్‌లోకి తొలి ట్రాన్స్​జెండర్.. రవాణా మంత్రిగా పీట్ బుట్టిగీగ్..
Sanjay Kasula
|

Updated on: Feb 03, 2021 | 3:36 PM

Share

Pete Buttigieg : రవాణా శాఖ మంత్రిగా పీట్ బుట్టిగీగ్ నియామకాన్ని అమెరికా సెనేట్ ఓకే చెప్పింది. దీంతో కేబినెట్ మంత్రి పదవికి ఎంపికైన తొలి ట్రాన్స్​జెండర్​గా పీట్ చరిత్ర స‌ృష్టించారు. బైడెన్ కేబినెట్​లో ఏకైక మిలేనియల్​గానూ రికార్డుల్లోకి ఎక్కారు.

రవాణా మంత్రిగా ఆయన్ను ఎంపిక చేస్తూ అధ్యక్షుడు జో బైడెన్ చేసిన ప్రతిపాదనను సెనేట్ ఆమోదించింది. స్వలింగ సంపర్కుడినని ఆయనే స్వయంగా ప్రకటించారు. కేబినెట్ మంత్రిగా ఎంపికైన ఏకైక వ్యక్తి బుట్టిగీగ్ కావడం విశేషం. ఆయన నామినేషన్​ను అమెరికా ఎగువసభ 86-13 ఓట్ల తేడాతో ఆమోదించింది.

ఇదివరకు ఇండియానాలోని సౌత్ బెండ్ నగరానికి మేయర్​గా పనిచేశారు బుట్టిగీగ్. నేవీలోనూ సేవలందించారు. 2020 అధ్యక్ష ప్రైమరీ ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థిత్వం కోసం బైడెన్​కు వ్యతిరేకంగా పోటీ చేశారు. అనంతరం రేసు నుంచి వైదొలిగి.. బైడెన్​కు మద్దతిచ్చారు.

బుట్టిగీగ్ నామినేషన్​ను అధ్యక్షుడు బైడెన్ డిసెంబర్​లో ఖరారు చేశారు. ఆయన అత్యంత తెలివైనవారని అప్పట్లో కొనియాడారు. 1982లో జన్మించిన బట్టిగీగ్.. బైడెన్ కేబినెట్​లో ఏకైక మిలేనియల్​గానూ నిలవనున్నారు. 1981 నుంచి 1996 మధ్య పుట్టినవారిని మిలేనియల్​గా వ్యవహరిస్తారు.

బుట్టిగిగ్‌కు అప్పగించిన రవాణాశాఖ శాఖ సవాళ్లతో కూడుకున్నది. ఉపాధి, మౌలిక వసతులు, వాతావరణ మార్పులకు సంబంధించి కీలకమైన శాఖలను ఇతరులకు అప్పగిస్తారు. ఉద్యోగాలు సృష్టించడం, వాతావరణ సవాల్ ఎదుర్కొవడం.. అందరికీ సమాన అవకాశాలు కల్పించడం అవకాశం అని పేర్కొన్నారు.

ఇక.. మిచిగాన్ మాజీ గవర్నర్ జెన్సిఫర్ గ్రాన్‌హోమ్‌కు కూడా తన కేబినెట్‌లోకి తీసుకున్నారు. ఇతను పునరుత్పాదక శక్తి పోర్టు పోలియోను ఇవ్వనున్నారు ప్రెసిడెంట్ బిడెన్. వెదర్ పాలసీ చీఫ్‌గా గినా మెక్‌కార్తీకి అప్పగిస్తారు. బరాక్ ఒబామా నేతృత్వంలో గల ప్రభుత్వంలో ఎన్విరాన్‌మెంట్ ప్రొటెక్షన్ ఏజెన్సీగా జెన్సిఫర్ గ్రాన్ పనిచేశారు. పీట్ బుట్టిగీగ్ యూఎస్ సెనేట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

ఇదిలావుంటే… జో బైడెన్‌ మంత్రివర్గంలో మరో మహిళకు స్థానం దక్కింది. వాణిజ్య శాఖ మంత్రి పదవిని గినా రైమోండో (49) నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గినా ప్రస్తుతం రోడ్‌ ఐలాండ్‌ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

బైడెన్ కేబినెట్‌లో భారతీయులు..

అమెరికా ప్రెసిడెంట్‌గా  బాధ్యతలు స్వీకరించిన తర్వాత తన మంత్రివర్గంలోకి  20 మందికి పైగా ప్రవాస భారతీయులను తీసుకున్నాడు జో బైడెన్. తాను అధికారంలోకి రావడానికి సాయం చేసిన.. ప్రచారంలో పనిచేసిన భారతీయులకు ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించారు. తన కేబినెట్‌లోకి తీసుకున్న భారతీయుల్లో ఉన్న సత్తాపై నమ్మకంతో కావొచ్చు… ఏది ఏమైనా కీలక బాధ్యతలు మొత్తం భారత సంతతి వ్యక్తుల చేతుల్లోనే అమెరికా అధ్యక్షుడు బైడెన్ పెట్టారు. అయితే  బైడెన్ గెలుపులో కీలక పాత్ర పోషించిన ఇద్దరు ఇండో అమెరికన్లకు మాత్రం బైడెన్ ఎలాంటి పదవిని ఇవ్వకపోవడం అమెరికాలోని భారతీయ సమాజంలో పెద్ద చర్చకు దారితీసింది. అమెరికా ప్రెసిడెంట్ ఒబామా హయాంలో పనిచేసిన సోనాల్‌షాతో పాటు బైడెన్‌ ప్రచార బృందంలోని ముఖ్య వ్యక్తి అమిత్‌ జానీని కూడా కొత్త అధ్యక్షుడు కేబినేట్‌లో చోటు దక్కలేదు.

ఇవి కూడా చదవండి :

Hyderabad Metro: మెట్రో అధికారులను అభినందించిన కేటీఆర్… అవయవ దానానికి ముందుకు రావడంపై ప్రశంస… నియంతల పేర్లన్నీ ‘ఎం’ అక్షరంతోనే మొదలవుతున్నాయి ఎందుకు.. రాహుల్ గాంధీ సంచలన ట్విట్.. సోషల్ మీడియాలో వైరల్..