US Snow Storm : మంచులో మునిగి తేలుతున్న అగ్రరాజ్యం.. ఐదేళ్ల తర్వాత రికార్డుస్థాయిలో హిమపాతం
మంచులో మునిగి తేలుతోంది అగ్రరాజ్యం. అమెరికాలో మంచుతుఫాన్ బీభత్సం సృష్ఠిస్తోంది. న్యూయార్క్‌లో ఐదేళ్ల తర్వాత రికార్డుస్థాయిలో హిమపాతం నమోదయ్యింది. రోడ్లపై గుట్టలుగా పేరుకుపోతున్న మంచు స్థానికులకు చుక్కలు చూపిస్తోంది.
US Snow Storm : మంచులో మునిగి తేలుతోంది అగ్రరాజ్యం. అమెరికాలో మంచుతుఫాన్ బీభత్సం సృష్ఠిస్తోంది. న్యూయార్క్‌లో ఐదేళ్ల తర్వాత రికార్డుస్థాయిలో హిమపాతం నమోదయ్యింది. రోడ్లపై గుట్టలుగా పేరుకుపోతున్న మంచు స్థానికులకు చుక్కలు చూపిస్తోంది. అమెరికాఈశాన్య రాష్ట్రాలు మంచుతుఫాన్‌తో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. అగ్రరాజ్యంలో ఎన్నికల గోల ముగిసి, అల్లర్లు ఓ కొలిక్కి వచ్చి, మామూలు జీవితానికి అలవాటుపడుతున్న అమెరికన్లపై ప్రకృతి చేసిన పెద్ద దాడి ఇది.
మంచుతీవ్రత కారణంగా న్యూయార్క్, న్యూజెర్సీల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. న్యూజెర్సీ తీరం వెంబడి గంటకు 48 నుంచి 64 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, మసాచుసెట్స్ తీరం వెంబడి గంటకు 97 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయవచ్చుని వాతావరణ విభాగం తెలిపింది.
ఇది ఈ శతాబ్దపు తుఫాన్ అని నిపుణులు అంటున్నారు. 2016లో న్యూయార్క్ సిటీలో 27.5 సెంటీమీటర్ల మంచుతుఫాన్ నమోదైంది. ఇప్పుడు న్యూయార్క్ సిటీలో 43 సెంటీమీటర్ల మంచుతుఫాన్ రికార్డయింది. న్యూయార్క్ సిటీ సెంట్రల్ పార్కులో 1869 తర్వాత 16వ పెద్ద మంచుతుఫాన్ ఇది. న్యూజెర్సీలోని కొన్ని ప్రాంతాల్లో 68 సెంటీమీటర్ల మంచు కురిసింది.
మన్‌హటన్ సెంట్రల్‌పార్క్‌లో 33 సెంటీమీటర్ల మంచు కురిసింది.మంచు తుఫాన్ దెబ్బకు న్యూయార్క్, న్యూజెర్సీకి వెళ్లే విమానాలు రద్దయ్యాయి. మొత్తం 1600 విమాన సర్వీసులు బంద్ అయ్యాయి. ప్రజలను బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు. అయినా జనం కొన్నిచోట్ల లెక్కచేయడం లేదు. మంచును యూత్ ఎంజాయ్ చేస్తున్నారు. ఆడుతూ పాడుతూ ఆస్వాదిస్తున్నారు. ప్రస్తుతం ఈ మంచు తుఫాన్ న్యూ ఇంగ్లండ్ వైపు కదులుతోంది.
పరిస్థితిని అద్యక్షుడు జో బైడెన్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. మంచుతుఫాన్‌కు కారణాలు ఏంటన్నదానిపై అధ్యయనం సాగుతోంది. వాతావరణ మార్పులు, కర్బన ఉద్గారాల వంటి వాటివల్ల పర్యావరణానికి నష్టం వాటిల్లుతోంది. ఇప్పటికే కాలిఫోర్నియా మంటలతో అల్లాడిన అగ్రరాజ్యం.. మంచుతుఫాన్‌లో తడిసి ముద్దవుతోంది. చాలా రాష్ట్రాల్లో మంచుతుఫాన్ కారణంగా కరెంట్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు.
ఇవి కూడా చదవండి :
Pete Buttigieg : అమెరికా కేబినెట్‌లోకి తొలి ట్రాన్స్జెండర్.. రవాణా మంత్రిగా పీట్ బుట్టిగీగ్..