జో బైడెన్ ప్రమాణ స్వీకారానికి ముందు క్యాపిటల్ హిల్ లో అమెరికన్ల శాంతి కోసం లేడీ గాగా ప్రార్థన, ద్వేషం కాదు, ప్రేమ కావాలన్నపిలుపు

అమెరికా అధ్యక్షునిగా జో బైడెన్ ప్రమాణ స్వీకారానికి ముందు దేశ జాతీయ గీతం ఆలపించాల్సి ఉన్న లేడీ గాగా క్యాపిటల్ హిల్ లో అమెరికన్ల శాంతి కోసం..

  • Umakanth Rao
  • Publish Date - 3:54 pm, Wed, 20 January 21
జో బైడెన్ ప్రమాణ స్వీకారానికి ముందు క్యాపిటల్ హిల్ లో అమెరికన్ల శాంతి కోసం లేడీ గాగా ప్రార్థన, ద్వేషం కాదు, ప్రేమ కావాలన్నపిలుపు

అమెరికా అధ్యక్షునిగా జో బైడెన్ ప్రమాణ స్వీకారానికి ముందు దేశ జాతీయ గీతం ఆలపించాల్సి ఉన్న లేడీ గాగా క్యాపిటల్ హిల్ లో అమెరికన్ల శాంతి కోసం ప్రార్థన చేసింది. రిహార్సల్స్ గా  దీన్ని చేపట్టింది. తెల్లని దుస్తులు ధరించిన ఈమెకు నేషనల్ గార్డులు రక్షణగా ఉన్నారు. ఇక జెన్నిఫర్ లోపెజ్, జాన్ లెజెండ్, క్రిసీ టీజిన్ వంటి సెలబ్రిటీలు కూడా పర్ఫార్మ్ చేయనున్నారు. అమెరికన్లు అంతా శాంతియుతంగా జీవించాలని కోరుతూ తాను ప్రేయర్ చేశానని, ద్వేషానికి తావు లేకుండా ప్రేమ కొనసాగాలని కోరుకున్నానని లేడీ గాగా చెప్పింది. అమెరికా దేశ భవిష్యత్తు హింసకు ఏ మాత్రం ఆస్కారం లేకుండా భద్రతతో కూడిన భావితరాలను ప్రభావితం చేసేలా ఉండాలని ఆమె పేర్కొంది. జో బైడెన్ కి గట్టి మద్దతుదారైన లేడీ గాగా ఆయనకు అనుకూలంగా పాప్ సాంగ్స్ పాడింది .  ఇక వాషింగ్టన్ లో బైడెన్, కమలా హారిస్ ప్రమాణ స్వీకారానికి అంతా సిద్దమైంది. కోవిడ్ నేపథ్యంలో ప్రజల రాకపై దాదాపు ఆంక్షలు విధించారు. ప్రధాన కూడళ్లలో బైడెన్, హారిస్ బ్యానర్లు కనిపిస్తున్నాయి. వైట్ హౌస్… బైడెన్ కి వెల్ కమ్ చెప్పడానికి ముస్తాబైంది.

 

Video Courtesy: Mail Online