AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

America Gun Fire: అమెరికాలో మరోసారి కాల్పుల మోత.. కాల్పుల్లో పోలీసులతో సహా ఐదుగురు మృతి

అగ్రరాజ్యం అమెరికాలో తుపాకీ మోత అనేది నిత్యకృత్యం అయిపోయింది. లేటెస్ట్‌గా ఇవాళ కూడా మళ్లీ కాల్పులతో దద్దరిల్లింది అమెరికా.

America Gun Fire: అమెరికాలో మరోసారి కాల్పుల మోత.. కాల్పుల్లో పోలీసులతో సహా ఐదుగురు మృతి
Gun Firing In America
Sanjay Kasula
|

Updated on: Oct 14, 2022 | 8:09 AM

Share

అమెరికాలో గన్ కల్చర్‌ రోజురోజుకూ పెచ్చుమీరుతోంది. అమెరికాలో మరోసారి ఆయుధాల బీభత్సం కొనసాగుతోంది. నార్త్ కరోలినాలో స్కూల్ విద్యార్థులను టార్గెట్ చేస్తూ ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డాడొక దుండగుడు. ఈ ఘటనలో పోలీసులతో సహా ఐదుగురు మృతిచెందారు. ఈ ఘటన అనంతరం పోలీసులు ఆ ప్రాంతమంతా చుట్టుముట్టారు. దీంతో పాటు దాడి చేసిన వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. దాడి చేసిన వ్యక్తి అకస్మాత్తుగా రద్దీగా ఉండే ప్రాంతానికి వచ్చి కాల్పులు జరిపాడని అమెరికన్ ఏజెన్సీలు తెలిపాయి. తనకు ఎదురుగా కనిపించిన వారిని కనిపించినట్లుగా కాల్చడం మొదలు పెట్టాడు. ఈ సమయంలో ఐదుగురు మరణించారని.. మరికొందరు గాయపడినట్లు సమాచారం. ప్రస్తుతం దాడి చేసిన వ్యక్తిని విచారిస్తున్నారు. 

అమెరికాలో తుపాకీ సంస్కృతి..

అమెరికాలో తుపాకీ కాల్పుల విధ్వంసం కొనసాగుతోంది. గత కొన్నేళ్లుగా అనేక మంది చిన్నారులతో సహా వందలాది మందిని కాల్చి చంపారు దుండగులు. తాజాగా అమెరికాలోని కాలిఫోర్నియాలో స్కూల్ పిల్లలను మళ్లీ టార్గెట్ చేసే ప్రయత్నం జరిగింది. ఓక్లాండ్‌లోని పాఠశాల ఆవరణలో భీకర కాల్పులు జరిగాయి. ఇందులో అనేక మంది గాయపడ్డారు. ఇంతకు ముందు కూడా పాఠశాలలో జరిగిన కాల్పుల్లో 17 మంది చిన్నారులు చనిపోయారు. ఇటీవల విడుదల చేసిన నివేదికలో, ఈ ఏడాది అమెరికాలో కాల్పుల ఘటనలతో సహా 96 మంది మరణించారని తెలిపింది. ఈ మరణాల్లో చాలా మంది చిన్నారులు కూడా ఉన్నారు. 

బిడెన్ తుపాకీ నియంత్రణ బిల్లును..

అయితే అమెరికా ప్రభుత్వం ఇప్పటికే తుపాకీ నియత్రణ బిల్లును రూపొందించింది. అమెరికాలో తుపాకీని కొనడం ఎవరికైనా చాలా సులభం. వస్తువులను విక్రయించినట్లుగానే అక్కడి దుకాణాల్లో తుపాకులు కూడా అమ్ముతుంటారు. అయితే, తుపాకీ సంస్కృతి విధ్వంసం దృష్ట్యా.. అధ్యక్షుడు జో బిడెన్ దీనికి సంబంధించి కఠినమైన చట్టాన్ని రూపొందించడం గురించి ఎన్నికల్లో ప్రచారంగా నిర్వహించారు. ఆ తర్వాత దానిపై ఒక చట్టం కూడా చేశారు. ఇది ప్రజల ప్రాణాలను కాపాడుతుందని బిడెన్ చెప్పారు. ముఖ్యంగా ఆయుధాల విక్రయాలపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. అంతే కాకుండా తుపాకులు కొనుగోలు చేసే వారిపై కఠినంగా విచారణ జరిపి అనుమానాస్పద లేదా ప్రమాదకరమైన వారి నుంచి తుపాకులను వెనక్కి తీసుకుంటారు. అమెరికాలో ఈ చట్టం అమల్లోకి వచ్చినప్పటికీ సామూహిక కాల్పుల ఘటనలు ఆగడం లేదు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం