పరికరాలు లేకుండానే 15 నిమిషాల్లో వైరస్ ను నిర్ధారణ..

ప్రత్యేక కంప్యూటర్‌ సాధనాలు అవసరంలేకుండా కరోనా వైరస్ ను నిర్ధారించే తొలి ర్యాపిడ్‌ పరీక్షకు అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ ఆమోదం తెలిపింది.

పరికరాలు లేకుండానే 15 నిమిషాల్లో వైరస్ ను నిర్ధారణ..
Follow us
Balu

|

Updated on: Aug 28, 2020 | 3:33 PM

ప్రపంచాన్ని చుట్టేసిన కరోనాతో జనం విలవిలలాడుతున్నారు. ఏ రూపంలో కరోనా వ్యాప్తి చెందుతుందోనని బెంబేలెత్తుతున్నారు. కరోనా అంటుకుందన్న భయంతో పరీక్షలు చేయించుకుంటున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న పరికరాలతో టెస్టులు చేయించుకుంటే రోజుల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇంతలో కరోనా సోకిన వ్యక్తులు యధేచ్చగా జనంలో తిరుగుతుండడంతో తనకు తెలియకుండానే ఇతరులకు అంటగడుతున్నారు. అయితే, పరీక్ష చేయించుకున్న క్షణాల్లో ఫలితం వచ్చేలా ఉండే పరికరాలపై సెంటిస్టులు అభవృద్ధి చేస్తున్నారు.

అయితే, ప్రత్యేక కంప్యూటర్‌ సాధనాలు అవసరంలేకుండా కరోనా వైరస్ ను నిర్ధారించే తొలి ర్యాపిడ్‌ పరీక్షకు అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) ఆమోదం తెలిపింది. 15 నిమిషాల్లో వైరస్ ను నిర్ధారణ పూర్తవుతుంది. అబాట్‌ సంస్థ దీన్ని రూపొందించింది. చిన్నపాటి యంత్రాలు అవసరమయ్యే ఇతర పరీక్షా విధానాలకు ఇది భిన్నమైందంటున్నారు సంస్థ ప్రతినిధులు. క్రెడిట్‌ కార్డు పరిమాణంలో ఈ కిట్‌ ఉంటుంది. ఒక్కో కిట్‌ ధరను 5 డాలర్లుగా నిర్ణయించినట్లు వారు తెలిపారు. ఇది అమెరికా మార్కెట్‌లోకి వస్తున్న చౌకైన, సులువైన కరోనా నిర్ధారణ విధానమని అధికారులు చెప్పారు. పరీక్షలను పెంచడానికి ఇది అత్యుత్తమ సాధనమన్నారు. యేల్‌ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన లాలాజల ఆధారిత పరీక్షకూ ఎఫ్‌డీఏ ఆమోదం తెలిపింది. అయితే, రెండు పరీక్షలనూ ఇళ్ల వద్ద నిర్వహించడం సాధ్యం కాదని అధికారులు అంటున్నారు. అబాట్‌ సంస్థ రూపొందించిన పరీక్ష విధానంలో ముక్కు నుంచి నమూనాను సేకరించాల్సి ఉంటుంది. యేల్‌ వర్సిటీ విధానంలో ఈ అవసరం ఉండదంటున్నారు. అయితే, పరీక్ష నిర్వహణకు అధునాతన లేబొరేటరీ మాత్రం తప్పసరి అని వైద్యులు చెబుతున్నారు.