పిచ్చ ఫన్.. మెలానియా ఇవాంక వీడియో
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యవహారం అంటే ఫన్ కు తప్పక చోటుంటుంది. ఈ సీన్ యూఎస్ ప్రథమ మహిళ మెలానియా - ట్రంప్ పెద్ద కుమార్తె ఇవాంక మధ్య అయితే, చెప్పేదేముంటుంది.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యవహారం అంటే ఫన్ కు తప్పక చోటుంటుంది. ఈ సీన్ యూఎస్ ప్రథమ మహిళ మెలానియా – ట్రంప్ పెద్ద కుమార్తె ఇవాంక మధ్య అయితే, చెప్పేదేముంటుంది. సీన్ బాగా రక్తికడుతుంది. రిపబ్లిక్ నేషనల్ కన్వెన్షన్(ఆర్‌ఎన్‌సీ) చివరి రోజు రాత్రి ఫంక్షన్లో జరిగిన ఓ సంఘటన దీనికి వేదికైంది. రెండో సారి ట్రంప్ అమెరికా అధ్యక్ష్య పదవికి నామినేట్ అయిన విషయాన్ని పురస్కరించుకొని నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఈ సంఘటన చోటుచేసుకుంది.
ప్రథమ మహిళ మెలానియాతో కలిసి అధ్యక్షుడు ట్రంప్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఇవాంక వేదిక మీదకి వస్తూ.. తన తండ్రిని, మెలానియాను నవ్వుతూ విష్ చేశారు. దీనికి బదులుగా ప్రథమ మహిళ కూడా చిరునవ్వులు చిందించారు. కానీ..ఏమైందో ఏమో.. సెకన్ల వ్యవధిలోనే ఇవాంక వ్యవహారం చూసి చిర్రెత్తికొచ్చినట్టు మొఖం పెట్టింది మొలానియా. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అయ్యింది. మీరూ చూస్తారా .. ఆ ఫన్నీ మూమెంట్.
This was so weird. #RNC2020 pic.twitter.com/YHReTl0bfT
— Dana Goldberg (@DGComedy) August 28, 2020