AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రజా సంక్షేమాన్ని ట్రంప్ విస్మరించారు : కమలా హారిస్

అమెరికా ప్రజల శ్రేయస్సు పట్ల అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీవ్ర నిర్లక్ష్యపూరిత వైఖరి ప్రదర్శించారని డెమొక్రటిక్‌ పార్టీ తరఫున ఉపాధ్యక్ష పదవికి పోటీ పడుతున్న కమలా హారిస్ ఆరోపించారు. ప్రజల సంక్షేమాన్ని ఆయన గాలికి వదిలేశారన్నారు.

ప్రజా సంక్షేమాన్ని ట్రంప్ విస్మరించారు : కమలా హారిస్
Balu
|

Updated on: Aug 28, 2020 | 5:16 PM

Share

అమెరికా ప్రజల శ్రేయస్సు పట్ల అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీవ్ర నిర్లక్ష్యపూరిత వైఖరి ప్రదర్శించారని డెమొక్రటిక్‌ పార్టీ తరఫున ఉపాధ్యక్ష పదవికి పోటీ పడుతున్న కమలా హారిస్ ఆరోపించారు. ప్రజల సంక్షేమాన్ని ఆయన గాలికి వదిలేశారన్నారు. ఓ అధ్యక్షుడిగా నిర్వహించాల్సిన కనీసం విధుల్ని కూడా ఆయన విస్మరించారన్నారు.ప్రపంచాన్ని కుదుపేస్తున్న కొవిడ్‌ కట్టడిలో తీవ్ర అశ్రద్ధ వహించారని కమలా విమర్శించారు. గురువారం ‘రిపబ్లికన్‌ నేషనల్‌ కన్వెన్షన్‌’లో ట్రంప్‌ కీలక ‘యాక్సెప్టెన్స్‌ స్పీచ్‌’కి కొన్ని గంటల ముందు కమల ఈ విమర్శలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

అమెరికా ప్రజల సంక్షేమాన్ని ట్రంప్‌ ఏమాత్రం పట్టించుకోలేదని కమలా హారిస్‌ విమర్శించారు. ప్రజల్ని రక్షించుకోవడం ఆయన విధి అని.. కానీ, దాన్ని నిర్వర్తించడంలో ట్రంప్‌ ఘోరంగా విఫలమయ్యారన్నారు. ట్రంప్‌ తన అసమర్థతను బటయపెట్టుకోవడం కొత్తేమీ కాదన్న కమలా.. జనవరిలో ప్రపంచాన్నే కబళించే వైరస్‌ వెలుగులోకి వచ్చినపుడు ఆయన అసమర్థత మరింత బయటపడిందన్నారు. వైరస్‌ ముప్పుని నిరాకరిస్తూ పెద్ద తప్పిదానికి పాల్పడ్డారన్నారు. ‘వైరస్‌కు భయపడాల్సిన అవసరం లేదు.. త్వరలో వైరస్‌ అంతం చేసే అద్భుతం జరగబోతోంది..’ వంటి వ్యాఖ్యలతో ప్రజల్ని మోసం చేశారన్నారు.

మరోవైపు, డెమొక్రటిక్‌ పార్టీ తరఫున అధ్యక్ష రేసులో ఉన్న జో బైడెన్‌ మాత్రం ప్రజల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసే ప్రయత్నం చేశారని కమలా హారిస్‌ చెప్పుకొచ్చారు. ముందు చూపుతో వ్యవహరించిన బైడెన్‌.. మహమ్మారిని ఎదుర్కొనేందుకు పటిష్ఠ ప్రణాళిక అవసరమని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ వచ్చారన్నారు. ప్రతిపక్షాల మాటలను ట్రంప్ ఎప్పుడు పెడచెవిన పెట్టారని కమలా హారిస్ విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో ట్రంప్ ను సాగనంపాలని కమలా హారిస్ అమెరికా ప్రజలకు కోరారు.