హిల్లరీ క్లింటన్ ఈ-మెయిల్స్ పై ట్రంప్ ఆరా ! ఎందుకు ?
అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ కు ప్రయివేటుగా అందిన ఈ-మెయిల్స్ పై ట్రంప్ ప్రభుత్వం ఆరా తీయడం ప్రారంభించింది. విదేశాంగ శాఖలో ప్రస్తుతమున్న అధికారులతో బాటు మాజీ అధికారులు కూడా ఆమెకు భారీగా ఈ-మెయిల్స్ పంపినట్టు ప్రభుత్వం భావిస్తోంది. 2016 లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. కాగా-ఆ ఈ-మెయిల్స్ లో ఎలాంటి సమాచారం ఉందన్న విషయంపై ఇటీవలి వారాల్లో విదేశాంగ శాఖ లోని దర్యాప్తు బృందం 130 […]
అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ కు ప్రయివేటుగా అందిన ఈ-మెయిల్స్ పై ట్రంప్ ప్రభుత్వం ఆరా తీయడం ప్రారంభించింది. విదేశాంగ శాఖలో ప్రస్తుతమున్న అధికారులతో బాటు మాజీ అధికారులు కూడా ఆమెకు భారీగా ఈ-మెయిల్స్ పంపినట్టు ప్రభుత్వం భావిస్తోంది. 2016 లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో హిల్లరీ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. కాగా-ఆ ఈ-మెయిల్స్ లో ఎలాంటి సమాచారం ఉందన్న విషయంపై ఇటీవలి వారాల్లో విదేశాంగ శాఖ లోని దర్యాప్తు బృందం 130 మందికి పైగా అధికారులను కాంటాక్ట్ చేసింది. వీరిలో సీనియర్లతో బాటు పలువురు జూనియర్ అధికారులు కూడా ఉన్నారు. ఈ అధికారుల్లో చాలామంది నేరుగా హిల్లరీకి రిపోర్టు చేసినట్టు భావిస్తున్నారు. ఈ-మెయిల్స్ లో కొన్ని ఆమె పర్సనల్ బాక్స్ కు చేరాయట.సెక్యూరిటీ ఉల్లంఘనకు సంబంధించి కొన్ని ఈ-మెయిల్స్ ని క్లాసిఫై చేసినట్టు వాషింగ్టన్ పోస్ట్ డైలీ తెలిపింది. చాలావాటిలో కీలక సమాచారం ఉందని, కొన్నింటిని క్లాసిఫైడ్ గా రీకేటగిరీ చేశారని తెలుస్తోంది. దాదాపు 18 నెలల క్రితం నుంచే ఈ ‘ దర్యాప్తు ప్రక్రియ ‘ మొదలైనప్పటికీ.. కొంతకాలం దీనికి ‘ విరామం ‘ ఇఛ్చి తిరిగి ఆగస్టు నుంచి ప్రారంభించినట్టు చెబుతున్నారు.
అసలు ఒబామా ప్రభుత్వం చివరి రోజులు పూర్తి కావస్తుండగా.అప్పటినుంచే రహస్యంగా ఇది మొదలైందని కూడా భావిస్తున్నారు. ఆ ఇన్వెస్టిగేషన్ కు అనుగుణంగా తాము స్టాండర్డ్ ప్రోటోకాల్ ను పాటిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. దాదాపు మూడున్నరే ఏళ్లుగా సాగిన లక్షలాది ఈ-మెయిళ్లపై దర్యాప్తు అంత సులభం కాదు. అయితే తన రాజకీయ ప్రత్యర్థుల ‘ వ్యూహాలపై ‘ ఈ దర్యాప్తు కోసం ట్రంప్ సీనియర్ అధికారులను వినియోగించుకుంటున్నారని అప్పుడే విమర్శలు ప్రారంభమవుతున్నాయి. డెమొక్రాట్లకు సంబంధించిన ‘ డ్యామేజింగ్ ఇన్ఫర్మేషన్ ‘ ను సంపాదించి వారిని ఇరకాటాన బెట్టాలన్నదే ట్రంప్ ఉద్దేశంగా కనిపిస్తోంది. బహుశా ఇందులో భాగంగానే ఆయన డెమొక్రాట్ నేత జోబిడెన్ ‘ అవినీతి ‘ పై విచారణ జరిపించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడిని కోరారని అంటున్నారు.
వచ్ఛే ఏడాది నవంబరులో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో జోబిడెన్ ట్రంప్ ప్రత్యర్థిగా పోటీ చేయనున్నారు. అటు-హిల్లరీ క్లింటన్ కు సంబంధించిన ఈ-మెయిల్స్ ఆరాలో రాజకీయ దురుద్దేశమేదీ లేదని విదేశాంగ శాఖ అంటోంది. ఇది రొటీన్ గా జరిగే వ్యవహారమేనని అధికారులు తేలిగ్గా చెబుతున్నారు. ఏమైనా-ఇంతకాలంగా లేని ఈ- మెయిల్స్ పై ట్రంప్ ప్రభుత్వం ఇప్పుడు ఇంత సీరియస్ గా దృష్టి సారించడంలోని ఉద్దేశమేమిటో తెలుస్తూనే ఉంది.
ఈ నెల 26 న హిల్లరీ క్లింటన్ సీబీఎస్ కు ఇఛ్చిన ఇంటర్వ్యూలో.. ట్రంప్ ను ‘ ఇల్లేజిటిమేట్ ప్రెసిడెంట్ ‘ (చట్టమంటే లెక్క లేని అధ్యక్షుడు) గా అభివర్ణించారు. ఆయన మళ్ళీ రెండోసారి అధ్యక్షుడయ్యేది కల్ల అన్నారు. గత ఎన్నికల్లో ట్రంప్ ఓటర్లను భయభ్రాంతులకు గురి చేసి అణగదొక్కారని, తప్పుడు హామీలు ఇచ్చ్చారని ఆమె ఆరోపించారు. 2016 లో తన ప్రచారం సందర్భంగా జరిగిన పొరబాట్లను పునరావృతం కానివ్వబోనని అన్నారు. ట్రంప్ ను అభిశంసిస్తే దానికి తన సపోర్ట్ ఉంటుందని హిల్లరీ స్పష్టం చేశారు. బహుశా ఆమె ఇలా తాజాగా చేసిన వ్యాఖ్యల వల్లే ట్రంప్ మళ్ళీ ఆమెకు సంబంధించిన ఈ-మెయిల్స్ వ్యవహారాన్ని తిరగదోడారని భావిస్తున్నారు.