కాలిఫోర్నియాలో కనీవినీ ఎరుగని కరువు…….మంచినీటిని ఎలా తాగాలంటే …..?

అమెరికాలోని కాలిఫోర్నియాలో కనీవినీ ఎరుగని కరువు ఏర్పడింది. వాతావరణ మార్పుల కారణంగా దుర్భిక్షం తాండవిస్తోంది.వర్షాలు పడక నదులు, రిజర్వాయర్లు ఎండిపోతున్నాయి. ముఖ్యంగా శాక్రిమెంటోలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది.

  • Updated On - 12:15 pm, Wed, 23 June 21 Edited By: Anil kumar poka
కాలిఫోర్నియాలో కనీవినీ ఎరుగని కరువు.......మంచినీటిని ఎలా తాగాలంటే .....?
Drought In California

అమెరికాలోని కాలిఫోర్నియాలో కనీవినీ ఎరుగని కరువు ఏర్పడింది. వాతావరణ మార్పుల కారణంగా దుర్భిక్షం తాండవిస్తోంది.వర్షాలు పడక నదులు, రిజర్వాయర్లు ఎండిపోతున్నాయి. ముఖ్యంగా శాక్రిమెంటోలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఇక్కడి మంచినీరు మట్టివాసన వస్తోందని స్థానికులు వాపోతున్నారు. వారిచ్చిన ఫిర్యాదుతో అధికారులు ఉచిత సలహా పారేశారు. ఈ నీటిలో కొంత నిమ్మరసం కలుపుకుని ఫ్రిజ్ లో పెట్టి తాగాలని సూచిస్తున్నారు. దశాబ్దంపైగా కరువుతో అల్లాడుతున్న ఈ సిటీలో ఇలాంటి పరిస్థితి మాత్రం ఏర్పడడం ఇదే మొదటిసారని అంటున్నారు. రానున్న కాలంలో సరస్సులు, నదులు మరింత ఎండిపోయే ప్రమాదం ఉందని భయపడుతున్నారు. ఏమైనా..వాతావరణ మార్పులను మానిటర్ చేసి వాటర్ ట్రీట్ మెంట్ కేంద్రాల ఏర్పాటుకు, విస్తరణకు అనువుగా రీసెర్చ్ కార్యక్రమాలను ఇంకా చేపడుతామని అధికారులు చెబుతున్నారు. భూగర్భ జలాలను మంచినీటిగా మార్చుకునే విధానాలపై ఫోకస్ పెడతామని వారు తెలిపారు.

నిజానికి అమెరికాలో పలు చోట్ల డ్రైనేజీ నీటినే శుద్ధి చేసి ఇళ్లకు సరఫరా చేసే ప్లాంట్లు ఉన్నాయి. ఏమైనా సాధ్యమైనంత త్వరగా శుద్ధమైన.. మంచి ‘నాణ్యత’ కలిగిన నీటిని అందించాలన్నదే తమ ధ్యేయమని నగర మున్సిపల్ సిబ్బంది చెప్పారు. నార్తర్న్ కాలిఫోర్నియాలోని సరస్సులో నీరు అడుగంటిపోతున్న కారణంగా మంచి నీటిని అందించే ఎడ్వర్డ్ హయర్ పవర్ ప్లాంటును మూసివేయనున్నారు. 1967 లో దీన్ని ప్రారంభించిన తరువాత మొదటిసారిగా ఇది మూతపడబోతోంది. రాష్ట్రంలోని 58 కౌంటీలకు గాను 41 కౌంటీలలో దుర్భిక్ష ఎమర్జెన్సీని గవర్నర్ గేవిన్ న్యూసమ్ ప్రకటించారు. ప్రజలు సాధ్యమైనంత పొదుపుగా నీటిని వాడుకోవాలని పిలుపునిచ్చారు. రాబోయే కాలంలో పరిస్థితి మరింత దారుణంగా ఉండవచ్చునని కూడా హెచ్చరించారు.

మరిన్ని ఇక్కడ చూడండి: నా రాజకీయాలు వారికి అసహ్యంగా అనిపించాయి.స్టార్ యాక్టర్ ఆర్నాల్డ్ ష్వాజ్‏నెగ్గర్ ఆవేదన..:

విడుదలకు ముందే ఆన్‌లైన్‌లో లీకైన ఫాస్ట్ & ఫ్యూరియస్ 9..!ఆగని పైరసీ :Fast & Furious 9 leaked video.

Rakul Preet Singh : క్లిక్స్ కోసం ఎలాంటి హెడ్డింగ్స్ అయినా పెట్టేస్తారా..?ఫైర్ అవుతున్న రకుల్ ప్రీత్.

నయా లుక్‌లో వావ్ అనిపిస్తున్న ధోనీ’ని ఇలా మీరెప్పుడూ చూసుండరు..వైరల్ అవుతున్న ఫోటోలు.:MS Dhoni video.