జో బైడెన్ ప్రమాణ స్వీకారానికి దూరం, 20న వాషింగ్టన్ కు వీడ్కోలు పలకనున్న డొనాల్డ్ ట్రంప్, ఇక నేరుగా ఫ్లోరిడాకు
అమెరికా అధ్యక్ష పదవి నుంచి వైదొలగుతున్న డోనాల్డ్ ట్రంప్ ఇక తట్టాబుట్టా సర్దుకోనున్నారు. ఈ నెల 20 న నూతన అధ్యక్షునిగా జో బైడెన్..
అమెరికా అధ్యక్ష పదవి నుంచి వైదొలగుతున్న డోనాల్డ్ ట్రంప్ ఇక తట్టాబుట్టా సర్దుకోనున్నారు. ఈ నెల 20 న నూతన అధ్యక్షునిగా జో బైడెన్ ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఆయన ఈ కార్యక్రమానికి గైర్ హాజరు కానున్నారు. ఆ రోజున వాషింగ్టన్ ను వీడి శివార్లలోని జాయింట్ బేస్ ఏంద్రూస్ వద్ద జరిగే వీడ్కోలు కార్యక్రమానికి హాజరై అక్కడ కొద్దిసేపు ప్రసంగించే అవకాశాలున్నాయి. ఫ్లోరిడాలోని పామ్ బీచ్ లో వైట్ హౌస్ కు చెందిన కొంతమంది సిబ్బంది ఆయన కార్యక్రమాలను పర్యవేక్షిస్తారని వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి. ఇనాగురేషన్ డే రోజున వైట్ హౌస్ లో బైడెన్ తో సమావేశం కావాలని కొందరు అధికారులు సూచించినప్పటికీ ట్రంప్ ఇందుకు నిరాకరించారు. అమెరికాలో రెండుసార్లు అభిశంసనకు గురైన తొలి అధ్యక్షునిగా పేరు తెచ్చుకున్న ఈయన తనకు తాను క్షమాభిక్ష విధించుకుంటారట.
ప్రతినిధుల సభలో అభిశంసన తీర్మానం నుంచి గట్టెక్కుతాననుకున్న ట్రంప్ ఆశాభంగం చెందక తప్పలేదు. చివరి క్షణంలోనైనా తనకు అదృష్ట యోగం పట్టవచ్చునని ట్రంప్ ఎంతో ఆశించారు. కానీ నిరాశే ఎదురయింది. ప్రతినిధుల సభలో 10 మంది రిపబ్లికన్లు కూడా ట్రంప్ అభిశంసన వైపే మొగ్గు చూపారు. క్యాపిటల్ హిల్ అల్లర్లకు బాధ్యుడని వారు గట్టిగా విశ్వసించారు. ఇక సెనేట్ లో ఈయన అభిశంసనకు సంబంధించి విచారణ జరగనుంది.
Also Read: