అమెరికా ఆర్థిక వ్యవస్థపై కొత్త సర్కార్ కీలక ప్రకటన.. మార్క్ చూపించేందుకు ప్రయత్నిస్తున్న జో బైడెన్

అమెరికాలో దెబ్బతిన్న దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే దిశగా భారీ ఆర్థిక ప్రణాళికను ప్రతిపాదించారు.

అమెరికా ఆర్థిక వ్యవస్థపై కొత్త సర్కార్ కీలక ప్రకటన..  మార్క్ చూపించేందుకు ప్రయత్నిస్తున్న జో బైడెన్
Follow us
Balaraju Goud

|

Updated on: Jan 15, 2021 | 11:17 AM

Biden Unveils Economic Relief Plan : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ … కరోనా వైరస్ రిలీఫ్ అండ్ ప్రభుత్వ నిధుల ప్యాకేజీ బిల్లుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన గురువారం కీలక ప్రకటన చేశారు. అమెరికా కరోనా మహమ్మారి విపత్తు నుండి తరిమికొట్టడంతో పాటు, క్షీణిస్తున్న ఆర్థిక వ్యవస్థ నుంచి విముక్తి కలిగించడానికి ఈ ప్యాకేజీ ఉపయోగపడనుంది. ముఖ్యంగా తీవ్రంగా దెబ్బతిన్న దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే దిశగా భారీ ఆర్థిక ప్రణాళికను ప్రతిపాదించారు. కొవిడ్ నియంత్రణ, ఆర్థికవ్యవస్థ స్థిరత్వం కోసం 1.9 ట్రిలియన్ డాలర్ల ప్యాకేజిని ప్రకటించారు. వచ్చే వారం బాధ్యతలు స్వీకరించిన వెంటనే అమెరికా ఆర్థిక వ్యవస్థలోకి ఈ భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రవేశపెడతామని బైడెన్ తెలిపారు. అమెరికాకు చెందిన కుటుంబాలు, వ్యాపారులతోపాటు వివిధ వర్గాలకు ప్రత్యక్ష సహాయం అందించే నిబంధనలతో ఈ కొత్త ప్యాకేజీని తీసుకువస్తున్నారు.

దీంతో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేయడంతో పాటు రాష్ట్ర, స్థానిక ప్రభుత్వాలకు ఆర్థిక ప్రోత్సాహం అందనుంది. దీనిలో భాగంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు 160 బిలియన్ డాలర్లు, మరో 170 బిలియన్ డాలర్లు పాఠశాలలకు కేటాయించనున్నట్లు జో బైడన్ వెల్లడించారు. అంతేకాదు, తన తొలి వంద రోజుల పాలనలో 100 మిలియన్ల మందికి టీకా అందించాలనే ఉద్దేశంతో అమెరికా రెస్క్యూ పేరిట మరో ప్రణాళికను కూడా ఈ సందర్భంగా బైడెన్ ప్రకటించారు. కరోనా దెబ్బతో అస్తవ్యస్తమైన అమెరికాకు ఈ రెండు ప్రతిపాదనలతో పెద్ద ఉపశమనమే కలుగుతుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.

అమెరికా ఉద్యోగులకు కనీస వేతనాన్ని గంటకు 15 డాలర్లకు పెంచడంతో పాటు పిల్లల సంరక్షణ కోసం బిలియన్ల నిధులను కేటాయించాలని జో బైడెన్ భావిస్తున్నారు. అలాగే, లక్షలాది మంది నిరుద్యోగ అమెరికన్లకు ఫెడరల్ నిరుద్యోగ ప్రయోజనాలను వారానికి 300 డాలర్ల నుండి వారానికి 400 డాలర్లకు పెంచాలని బిడెన్ ప్రతిపాదించారు.

మరోసారి కేరళ ఎయిర్‌పోర్టులో అక్రమ బంగారం.. ప్రయాణికుడు తరలిస్తున్న తీరు చూసి ఖంగుతిన్న అధికారులు..!