అల్ ఖైదా అగ్రనేత ఖాసీం అల్-రేమి హతంః ట్రంప్
Al Qaeda Terrorist Chief: అగ్రరాజ్యం అమెరికా ఒక్కొక్కరిగా ఉగ్రవాదులను చంపుకుంటూ వస్తోంది. తాజాగా ఆ దేశం మరో ఉగ్రవాదిని హతమార్చింది. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న అల్‌ఖైదా అగ్రనేతల్లో ఒకరైన ఖాసీం అల్-రేమిని మట్టుబెట్టినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇతడు అల్ ఖైదా గ్లోబల్ లీడర్ అమాన్ అల్-జవహరీకి డిప్యూటీగా ఉన్న అల్ ఖైదా యెమెన్ శాఖకు నాయకుడు. కొన్నేళ్లుగా అరేబియా ద్వీపకల్ప ప్రాంతాన్ని అడ్డాగా చేసుకుని సామాన్యులపై దాడులకు తెగబడుతున్నాడు. యెమెన్‌లో ఉగ్రవాదుల ఏరివేతలో […]
Al Qaeda Terrorist Chief: అగ్రరాజ్యం అమెరికా ఒక్కొక్కరిగా ఉగ్రవాదులను చంపుకుంటూ వస్తోంది. తాజాగా ఆ దేశం మరో ఉగ్రవాదిని హతమార్చింది. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న అల్‌ఖైదా అగ్రనేతల్లో ఒకరైన ఖాసీం అల్-రేమిని మట్టుబెట్టినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇతడు అల్ ఖైదా గ్లోబల్ లీడర్ అమాన్ అల్-జవహరీకి డిప్యూటీగా ఉన్న అల్ ఖైదా యెమెన్ శాఖకు నాయకుడు. కొన్నేళ్లుగా అరేబియా ద్వీపకల్ప ప్రాంతాన్ని అడ్డాగా చేసుకుని సామాన్యులపై దాడులకు తెగబడుతున్నాడు.
యెమెన్‌లో ఉగ్రవాదుల ఏరివేతలో భాగంగా జరిగిన కాల్పుల్లో అల్‌ఖైదా(ఏక్యూఏపీ) అధినేత ఖాసీం అల్-రేమీని అమెరికా హతమార్చింది. రేమి నేతృత్వంలో ఆల్‌ఖైదా సామాన్య ప్రజలపై అనేక దాడులు చేసింది. ఇప్పుడు అతడు చనిపోవడంతో ఆల్‌ఖైదా కార్యకలాపాలు పూర్తిగా ఆగిపోనున్నాయి. ఈ మేరకు అమెరికా వైట్ హౌస్ ఓ ప్రకటనను విడుదల చేసింది. కాగా, ఖాసీం అల్-రేమీ ఎప్పుడు చనిపోయాడన్న విషయాలను మాత్రం వెల్లడించలేదు.