అభిశంసన నుంచి గట్టెక్కి…సెలబ్రేషన్స్ మూడ్‌లో ట్రంప్

అనుకున్నట్టే జరిగింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై సెనేట్‌లో అభిశంసన తీర్మానం వీగిపోయింది. రిపబ్లికన్లు ఎక్కువ సంఖ్యలో ఉన్న ఈ సభలో ఆయన సులభంగా విముక్తుడవుతారని మొదటినుంచీ అనుకున్నదే.. నాలుగు నెలల తన ఇంపీచ్ మెంట్ వ్యవహారం ఇక ముగిసిందని ట్రంప్ ట్వీట్ చేశారు. తాను నిర్దోషినంటూ సెనేట్ ప్రకటించడాన్ని ‘ కాకీ మేమ్ లతో’ సెలబ్రేట్ చేసుకున్నారు. ఒక ఎన్నిక తరువాత ఒకటిగా తాను  విజయం సాధిస్తూ వస్తున్నానని, శాశ్వతంగా తను ఈ దేశాధ్యక్షుడినేనని […]

అభిశంసన నుంచి గట్టెక్కి...సెలబ్రేషన్స్ మూడ్‌లో ట్రంప్
Follow us
Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Feb 06, 2020 | 11:38 AM

అనుకున్నట్టే జరిగింది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై సెనేట్‌లో అభిశంసన తీర్మానం వీగిపోయింది. రిపబ్లికన్లు ఎక్కువ సంఖ్యలో ఉన్న ఈ సభలో ఆయన సులభంగా విముక్తుడవుతారని మొదటినుంచీ అనుకున్నదే.. నాలుగు నెలల తన ఇంపీచ్ మెంట్ వ్యవహారం ఇక ముగిసిందని ట్రంప్ ట్వీట్ చేశారు. తాను నిర్దోషినంటూ సెనేట్ ప్రకటించడాన్ని ‘ కాకీ మేమ్ లతో’ సెలబ్రేట్ చేసుకున్నారు. ఒక ఎన్నిక తరువాత ఒకటిగా తాను  విజయం సాధిస్తూ వస్తున్నానని, శాశ్వతంగా తను ఈ దేశాధ్యక్షుడినేనని అన్నారు. . ‘ట్రంప్ 4 ఎవా ‘ పేరిట ఆయన ఓ వీడియో కూడా పోస్ట్ చేశారు. తన నిర్దోషిత్వంపై వైట్ హౌస్ లో ప్రకటన చేస్తానని తెలిపారు.  అయితే అభిశంసన తీర్మానంపై ఓటింగ్ జరిగినప్పుడు ఓ తమాషా జరిగింది. మిట్ రోమ్నే అనే రిపబ్లికన్.. మొదట ట్రంప్ ను దోషిగా పేర్కొన్నారు. అయితే ఇతర కాంగ్రెస్ సభ్యులు, రిపబ్లికన్లు అభ్యంతరం వ్యక్తం చేయడంతో తన మనస్సు మార్చుకుని ట్రంప్ నిర్దోషి అని ప్రకటించారు.

ఇలా ఉండగా.. తమ దేశాధ్యక్షుడిని అభిశంసించడానికి డెమొక్రాట్లు కట్టుకథ అల్లారని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ స్టెఫానీ గ్రిషం ఆరోపించారు. డెమొక్రాట్లది సిగ్గుచేటయిన ప్రవర్తన అన్నారు. స్పీకర్ నాన్సీ పెలోసీ మాత్రం ట్రంప్ పై తమ న్యాయ పోరాటం సాగుతూనేఉంటుందన్నారు.. అమెరికా ప్రజాస్వామ్యానికి ఆయన ఓ ప్రమాదకరమైన వ్యక్తి అని ఆమె అభివర్ణించారు. సెనేట్ రాజ్యాంగానికి ద్రోహం చేసిందన్నారు. తలచుకుంటే ట్రంప్ ఎన్నికల వ్యవస్థను కూడా అవినీతిమయం చేయగలడని పెలోసీ దుయ్యబట్టారు.