రామాలయ నిర్మాణానికి మోదీ సర్కార్ ఇచ్చిన విరాళం ఇదే.. ఎంతో అనుకునేరు..

అయోధ్య శ్రీ రామ మందిర నిర్మాణానికి అడ్డంకులన్నీ తొలగిపోవడంతో.. ఇక మందిర నిర్మాణ దిశగా అడుగులు వేస్తోంది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో మందిర నిర్మాణం కోసం.. స్వతంత్ర ట్రస్ట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు పార్లమెంట్‌ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. సుప్రీం ఆదేశాలకు అనుగుణంగా.. “శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్రం” పేరుతో ఈ ట్రస్టును ఏర్పాట్లు చేసినట్లు ఈ సందర్భంగా తెలిపారు. ఆలయ నిర్మాణానికి దేశ ప్రజలంతా సహకరించాలని మోదీ పిలుపునిచ్చారు. ఈ రామమందిర నిర్మాణం కోసం […]

రామాలయ నిర్మాణానికి మోదీ సర్కార్ ఇచ్చిన విరాళం ఇదే.. ఎంతో అనుకునేరు..

అయోధ్య శ్రీ రామ మందిర నిర్మాణానికి అడ్డంకులన్నీ తొలగిపోవడంతో.. ఇక మందిర నిర్మాణ దిశగా అడుగులు వేస్తోంది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో మందిర నిర్మాణం కోసం.. స్వతంత్ర ట్రస్ట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు పార్లమెంట్‌ వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. సుప్రీం ఆదేశాలకు అనుగుణంగా.. “శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్రం” పేరుతో ఈ ట్రస్టును ఏర్పాట్లు చేసినట్లు ఈ సందర్భంగా తెలిపారు. ఆలయ నిర్మాణానికి దేశ ప్రజలంతా సహకరించాలని మోదీ పిలుపునిచ్చారు. ఈ రామమందిర నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన ట్రస్టులో 15 మంది ట్రస్టీలు ఉంటారని.. వారిలో ఒకరు ఎస్సీ వర్గానికి చెందిన వారు కూడా ఉంటారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. కాగా ఈ ట్రస్టుకు చైర్మన్‌గా పరాశరన్‌‌ను నియమించారు.

కాగా.. అయోధ్య రామమందిర నిర్మాణానాకి గాను ..”శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రం”కి మోదీ సర్కార్.. ప్రభుత్వం తరఫున విరాళాన్ని ప్రకటించింది. అది కూడా కేవలం ఒక్కరూపాయిని మాత్రమే. ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కార్యదర్శి డి.ముర్ము.. స్పష్టం చేశారు. ట్రస్టు సభ్యులకు ఒక రూపాయి నగదును అందజేశామన్నారు. ఈ సందర్భంగా.. రామమందిర నిర్మాణం కోసం ఎవరైనా విరాళాలను ఇస్తే.. వాటిని ఎటువంటి షరతు లేకుండా స్వీకరిస్తామన్నారు. నగదు, ఆస్తుల రూపంలో ఇచ్చినా .. ట్రస్టు స్వీకరిస్తుందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ ట్రస్టు మాజీ అటార్నీ జనరల్‌ పరాశరన్‌ ఇంటిని కేంద్రంగా చేసుకొని కార్యకలాపాలను కొనసాగించనున్నారు. త్వరలోనే ఈ “శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్రం” ట్రస్టుకు అధికారిక కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు.

Click on your DTH Provider to Add TV9 Telugu