హిందూ మహాసభ అధ్యక్షుని కాల్చివేత ఘటనలో సూత్రధారి అరెస్ట్

విశ్వహిందూ మహాసభ అధ్యక్షుడు రంజిత్ బచ్చన్  ను కాల్చి చంపిన హంతకుల్లో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. గత ఆదివారం లక్నోలో మార్నింగ్ వాక్ చేస్తున్న రంజిత్ ను అతి సమీపం నుంచి దుండగులు కాల్చి చంపిన సంగతి తెలిసిందే. హత్య అనంతరం అసలు సూత్రధారి ముంబైవెళ్లి అక్కడ తలదాచుకోగా లక్నో పోలీసులు ఈ నగరానికి చేరుకొని అతడ్ని పట్టుకున్నారు. ఇతడు దాక్కున్న పరిసర ప్రాంతాల్లోనే మరో ఇద్దరిని కూడా వారు అదుపులోకి తీసుకున్నారు. అటు- […]

హిందూ మహాసభ అధ్యక్షుని కాల్చివేత ఘటనలో సూత్రధారి అరెస్ట్

విశ్వహిందూ మహాసభ అధ్యక్షుడు రంజిత్ బచ్చన్  ను కాల్చి చంపిన హంతకుల్లో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. గత ఆదివారం లక్నోలో మార్నింగ్ వాక్ చేస్తున్న రంజిత్ ను అతి సమీపం నుంచి దుండగులు కాల్చి చంపిన సంగతి తెలిసిందే. హత్య అనంతరం అసలు సూత్రధారి ముంబైవెళ్లి అక్కడ తలదాచుకోగా లక్నో పోలీసులు ఈ నగరానికి చేరుకొని అతడ్ని పట్టుకున్నారు. ఇతడు దాక్కున్న పరిసర ప్రాంతాల్లోనే మరో ఇద్దరిని కూడా వారు అదుపులోకి తీసుకున్నారు. అటు- మొదట గోరఖ్ పూర్, రాయ్ బరేలీలో  నలుగురు అనుమానితులను అరెస్టు చేశారు. వారిచ్చిన సమాచారంతో ప్రధాన నిందితుడు ముంబైలో పట్టుబడ్డాడు. 40 ఏళ్ళ రంజిత్ బచ్ఛన్ పై కాల్పులు జరిగిన ఘటనలో ఆయన కజిన్ శ్రీవాస్తవ గాయపడ్డారు. దుండగుడు తన ముఖం కనిపించకుండా శాలువా కప్పుకుని నడుచుకుంటూ వఛ్చి రంజిత్ మీద కాల్పులు జరిపినట్టు తెలిసింది.

Click on your DTH Provider to Add TV9 Telugu