AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tragedy: మాటలకందని విషాదం.. భార్య ఏడు నెలల గర్భవతి.. భర్త అమెరికాలో దుండగుల కాల్పులకి బలి

అమెరికాలో ఓ అగంతకుడు జరిపిన కాల్పుల్లో ఏపీ వాసి మృతి చెందాడు. పాత బర్మింగ్‌హామ్ హైవేలోని క్రౌన్ సర్వీస్ స్టేషన్‌లో దుండగుడు జరిపిన కాల్పుల్లో.. సత్యకృష్ణ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.

Tragedy: మాటలకందని విషాదం.. భార్య ఏడు నెలల గర్భవతి.. భర్త అమెరికాలో దుండగుల కాల్పులకి బలి
Satya Krishna Chitturi
Ram Naramaneni
|

Updated on: Feb 13, 2022 | 3:26 PM

Share

Satya Krishna Chitturi Family: భార్య ఏడు నెలల గర్భవతి.. భర్త అమెరికాలో దుండగుల కాల్పులకి బలి. మాటలకందని విషాదంతో చిట్టూరి సత్య కృష్ణ కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. కృష్ణా జిల్లా కలిదిండిలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఉన్నత చదువుల కోసం వెళ్లి.. దొంగల తూటాలకి బలైపోవడంతో సత్యకృష్ణ భార్య, అతని తల్లిదండ్రులు రోధిస్తున్న తీరు అందర్నీ కంటతడి పెట్టిస్తోంది. సత్యకృష్ణకు మూడేళ్ల కిందట భీమవరానికి చెందిన ప్రఙ్ఞతో వివాహమైంది. ప్రస్తుతం ప్రఙ్ఞ ఏడునెలల గర్భవతి. గత నెల 12న ఎమ్మెస్‌ చదివేందుకు అమెరికా(America) వెళ్లాడు సత్యకృష్ణ. అలబామాలోని పాతబర్మింగ్‌హామ్‌ హైవేలో ఉన్న క్రౌన్‌ సర్వీస్‌ స్టేషన్‌లో స్టోర్‌ క్లర్క్‌గా పార్ట్‌టైమ్ జాబ్ చేస్తున్నాడు. గురువారం సత్యకృష్ణ డ్యూటీ చేస్తున్న సమయంలో.. బ్లాక్‌షర్ట్స్‌, ఫేస్‌ మాస్క్‌లు ధరించిన దుండగులు సర్వీస్ స్టేషన్‌లోకి చొరబడ్డారు. ఎవరు.. ఏంటి? ప్రశ్నిస్తుండగానే విచక్షణారహితంగా కాల్పులకి తెగబడ్డారు. ఫైరింగ్‌లో సత్యకృష్ణ స్పాట్‌లోనే చనిపోయాడు. సీసీ ఫుటేజ్ ఆధారంగా హంతకుల ఫోటోలు రిలీజ్ చేశారు లోకల్ పోలీసులు.

సత్యకృష్ణ చనిపోయిన వార్త తెలుసుకుని కుటుంబం భోరుమంది. భార్య ప్రఙ్ఞ అయితే కుప్పకూలిపోయింది. సత్యకృష్ణ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేసేవాడు. కానీ ఏదో సాధించాలనే తపనతో హయ్యర్ స్టడీస్‌కి వెళ్లాడు. కానీ ఇలా జరుగుతుందని ఊహించలేదంటూ సత్యకృష్ణ కుటుంబం గుండెలు బాదుకుంటోంది. సత్యకృష్ణ భార్యను ఓదార్చడం ఎవరి వల్లా కావడం లేదు. సత్యకృష్ణ మృతదేహాన్ని స్వదేశం పంపించేందుకు అక్కడి తెలుగు సంఘాలు విరాళాలు సేకరిస్తున్నారు. ఇప్పటిదాకా లక్షడాలర్ల వరకు సేకరించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా సాయం చేయాలని సత్యకృష్ణ కుటుంబం వేడుకుంటోంది.

Also Read: ఇంజినీరింగ్ కంప్లీట్ చేశాడు.. ఎందులో స్పెషలిస్టో తెలిస్తే.. బుర్ర బ్లాంక్ అవ్వడం ఖాయం

ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే