Zain Nadella: మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్ల ఇంట్లో విషాదం.. కుమారుడు జైన్ నాదెళ్ల మృతి
Zain Nadella: మైక్రోసాఫ్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) సత్యనాదెళ్ల (Satya Nadella) ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన కుమారుడు జైన్ నాదెళ్ల (26) మరణించారు. అయితే..

Zain Nadella: మైక్రోసాఫ్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) సత్యనాదెళ్ల (Satya Nadella) ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన కుమారుడు జైన్ నాదెళ్ల (26) మరణించారు. అయితే ఆయన పుట్టుకతోనే మస్తిష్క పక్షవాతం వ్యాధితో బాధపడుతున్నాడు. అమెరికా కాలమాన ప్రకారం సోమవారం తీవ్ర అనారోగ్యానికి గురవడంతో మృతి చెందారు. జైన్ నాదెళ్ల మృతి చెందినట్లు సాఫ్ట్‌వేర్ కంపెనీ తన సిబ్బందికి ఇమెయిల్ పంపింది.
కాగా, జైన్ నాదెళ్ల సెరిబ్రల్ పాల్సీతో జన్మించాడు. సెరిబ్రల్ పాల్సీ అంటే.. పుట్టుకతోనే బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది. దీంతో మెదడుకు కాళ్లు, చేతులపై కంట్రోల్ ఉండదు. నడవలేని స్థితిలో ఉండటం కారణంగా వీల్‌చైర్‌కే పరిమితం కావాల్సి ఉంటుంది. కాగా సత్యనాదెళ్లకు కుమారుడితోపాటు ఇద్దరు కూతుళ్లు కూడా ఉన్నారు.
సత్యనాదెళ్ల 2014లో మైక్రోసాఫ్ట్ సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. ఆయన బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వైకల్యం కలిగిన వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు ఉత్పత్తుల రూపకల్పనపై ప్రత్యేక దృష్టి సారించారు. సత్యనాదెళ్ల పలు సందర్భాలలో జైన్ ఆరోగ్య పరిస్థితిని కూడా వివరించారు. జైన్ తన ఎక్కువగా చిల్డ్రన్స్ హాస్పిటల్‌లోనే చికిత్స పొందారు.

ఇవి కూడా చదవండి:
