ఇజ్రాయెల్ వైమానిక మెరుపు దాడి.. హౌతీ ప్రధాన మంత్రి సహా పలువురు మంత్రుల దుర్మరణం!
యెమెన్ రాజధాని సనాలో ఇజ్రాయెల్ వైమానిక దాడికి పాల్పడింది. శనివారం (ఆగస్టు 30) జరిగిన దాడిలో ప్రధాని అహ్మద్ అల్-రహ్వీ మరణించినట్లు యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు నిర్ధారించారు. ఈ మేరకు ఇరాన్ మద్దతుగల హౌతీ తిరుగుబాటుదారుల బృందం శనివారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. గురువారం జరిగిన ఇజ్రాయెల్ దాడిలో అల్-రహవి మరణించారని తిరుగుబాటుదారుల బృందం ఆ ప్రకటనలో తెలిపింది.

యెమెన్ రాజధాని సనాలో ఇజ్రాయెల్ వైమానిక దాడికి పాల్పడింది. శనివారం (ఆగస్టు 30) జరిగిన దాడిలో ప్రధాని అహ్మద్ అల్-రహ్వీ మరణించినట్లు యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు నిర్ధారించారు. ఈ మేరకు ఇరాన్ మద్దతుగల హౌతీ తిరుగుబాటుదారుల బృందం శనివారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. గురువారం (ఆగస్టు 28) జరిగిన ఇజ్రాయెల్ దాడిలో అల్-రహవి మరణించారని తిరుగుబాటుదారుల బృందం ఆ ప్రకటనలో తెలిపింది. ఇజ్రాయెల్ దాడిలో అల్-రహవితో పాటు, అనేక మంది మంత్రులు కూడా మరణించినట్లు పేర్కొంది.
గాజాకు మద్దతుగా హౌతీ తిరుగుబాటు బృందం ఇజ్రాయెల్‌పై నిరంతరం దాడి చేస్తోంది. ఈ క్రమంలోనే గత సంవత్సరం ప్రభుత్వ పనిని సమీక్షించడానికి జరిగిన వర్క్‌షాప్‌కు అధికారులు హాజరైన సమయంలో యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులపై ఇజ్రాయెల్ సైన్యం దాడి చేసింది.
అదే సమయంలో, ఇజ్రాయెల్ సైన్యం దాడిని ధృవీకరించింది. యెమెన్ రాజధాని సనా ప్రాంతంలోని హౌతీ ఉగ్రవాద అధికారిక భవనాలు, సైనిక స్థావరంపై ఐడిఎఫ్ ఖచ్చితమైన దాడి చేసిందని తెలిపింది. గాజాలో జరుగుతున్న యుద్ధంలో హౌతీ తిరుగుబాటుదారులు చాలా కాలంగా హమాస్‌కు మద్దతుదారులుగా ఉన్నారు. హమాస్ వైపు తీసుకొని, హౌతీ తిరుగుబాటుదారులు గత కొన్ని నెలలుగా ఇజ్రాయెల్ వైపు అనేక క్షిపణులు, డ్రోన్‌లను ప్రయోగించారు.
🔴عاجل🔴رئاسة الجمهورية اليمنية: نعلن استشهاد المجاهد أحمد غالب الرهوي رئيس الوزراء في حكومة التغيير والبناء مع عدد من رفاقه الوزراء يوم الخميس الماضي pic.twitter.com/sSpIqTukkn
— قناة المسيرة (@TvAlmasirah) August 30, 2025
ఇజ్రాయెల్‌పై తమ దాడులు పాలస్తీనియన్లకు సంఘీభావం చూపించడానికే అని హౌతీ తిరుగుబాటుదారులు బహిరంగంగా చెప్పారు. అయితే, హౌతీ తిరుగుబాటుదారుల క్షిపణులు, డ్రోన్‌లలో ఎక్కువ భాగం దాడి చేయడానికి ముందే ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థ ద్వారా గాల్లోనే ధ్వంసం చేశాయి.. అయినప్పటికీ, హౌతీ తిరుగుబాటుదారుల సమూహం ఇజ్రాయెల్‌ను నిరంతరం లక్ష్యంగా చేసుకుని తన దాడిని కొనసాగించింది.
హౌతీ మద్దతుగల ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, యెమెన్‌లోని సనాలోని అనేక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ వైమానిక దాడులు నిర్వహించింది. ఆ దాడుల్లో కనీసం 10 మంది మరణించగా, 100 మందికి పైగా గాయపడ్డారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
