“ఆ దేశ చర్యలతో కొత్త వేరియంట్లు పుట్టుకురావచ్చు”.. డబ్ల్యూహెచ్ఓ ఆందోళన
వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న రోజుల్లో వైరస్ ప్రభావం అంతగా లేని ఉత్తర కొరియాలో(North Korea) ప్రస్తుతం కరోనా వ్యాప్తి విజృంభిస్తోంది. లక్షల సంఖ్యలో ప్రజలు మిస్టరీ జ్వరం బారినపడుతున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. ఉత్తర కొరియా....
వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న రోజుల్లో వైరస్ ప్రభావం అంతగా లేని ఉత్తర కొరియాలో(North Korea) ప్రస్తుతం కరోనా వ్యాప్తి విజృంభిస్తోంది. లక్షల సంఖ్యలో ప్రజలు మిస్టరీ జ్వరం బారినపడుతున్నట్లు అక్కడి అధికారులు తెలిపారు. ఉత్తర కొరియా పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసిన డబ్ల్యూహెచ్ఓ.. ఈ ఉద్ధృతి కొత్త వేరియంట్లకు కారణం అవ్వొచ్చని వెల్లడించింది. కరోనా కట్టడికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాధనాలు వాడకపోతే ఇది కచ్చితంగా ఆందోళన కలిగించే పరిణామమేనని వ్యాఖ్యానించింది. ఎటువంటి నియంత్రణ లేకుండా వైరస్(Virus) వ్యాప్తి చెందితే కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పదేపదే చెప్తోందని ఆరోగ్య సంస్థ ఎమర్జెన్సీస్ డైరెక్టర్ మైక్ ర్యాన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్తర కొరియాలో వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఔషధాలు, టీకాలు, పరీక్షా సాధానాలు వంటి విషయాల్లో సహాయం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. ఉత్తర కొరియా ప్రజలకు తాజా కొవిడ్ ఆంక్షలు(Corona Restrictions) భయంకరంగా మారనున్నాయని ఐక్యరాజ్యసమితి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఎటువంటి వివక్ష లేకుండా, సమయానుకూలంగా తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది.
గత రెండున్నరేళ్లుగా తమ దేశంలో కోవిడ్ కేసులు లేవని ఉత్తరకొరియా చెబుతూ వచ్చింది. కానీ, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. సింగిల్ డే కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. కొద్ది రోజుల క్రితం ఒమిక్రాన్ మొదటి కేసు నమోదు కాగా, తాజాగా భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు పెరగడం నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్‌జోంగ్ ఉన్ ఆందోళనలో పడ్డారు. వైద్యా ఆరోగ్య శాఖతో అత్యవవసర భేటీ నిర్వహించారు.
బుధవారం ఉత్తర కొరియాలో 2.32 లక్షల మందికి పైగా కరోనా బారినపడ్డారు. వైరస్ కారణంగా ఆరుగురు మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1.7 మిలియన్లకు చేరగా మరణాలు 62కు పెరిగాయి. ఈ ఉద్ధృతికి అధికారుల అపరిపక్వత, ఆలస్యంగా స్పందించడమే కారణమని అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మండిపడ్డారు.
మరిన్ని అంతర్జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
ఇవీ చదవండి
Horoscope Today: గురువారం రాశిఫలాలు.. ఈరోజు ఈరాశివారు ఆదాయానికి మించి ఖర్చులు చేయాల్సి ఉంటుంది..
Konaseema: తాటి కాయలతో చక్రాల బండి.. గత జ్ఞాపకాలను గుర్తుకు తెస్తున్న కోనసీమ చిన్నారులు
TOP 9 ET News: F3 టికెట్ రేట్లపై గుడ్ న్యూస్ | మరో ఇంట్రెస్టింగ్ మూవీకి చెర్రీ ఓకే