Putin vs Canada PM: రష్యా ప్రెసిడెంట్‌ వ్లాదిమిర్‌ పుతిన్‌కు కెనడా షాక్‌.. ఏకంగా ప్రత్యేక బిల్లునే తీసుకొచ్చి..

Putin vs Canada PM: రష్యా ప్రెసిడెంట్‌ వ్లాదిమిర్‌ పుతిన్‌కు షాక్‌ మీద షాకిస్తున్నాయ్ ప్రపంచ దేశాలు. ఉక్రెయిన్‌పై బాంబుల వర్షం కురిపిస్తోన్న

Putin vs Canada PM: రష్యా ప్రెసిడెంట్‌ వ్లాదిమిర్‌ పుతిన్‌కు కెనడా షాక్‌.. ఏకంగా ప్రత్యేక బిల్లునే తీసుకొచ్చి..
Putin
Follow us

|

Updated on: May 19, 2022 | 8:04 AM

Putin vs Canada PM: రష్యా ప్రెసిడెంట్‌ వ్లాదిమిర్‌ పుతిన్‌కు షాక్‌ మీద షాకిస్తున్నాయ్ ప్రపంచ దేశాలు. ఉక్రెయిన్‌పై బాంబుల వర్షం కురిపిస్తోన్న రష్యాపై ఇప్పటికే కఠిన ఆంక్షలు విధించిన కంట్రీస్‌, ఇప్పుడు ఊహించని నిర్ణయాలు తీసుకుంటున్నాయ్‌. ఏకంగా వ్లాదిమిర్‌ పుతిన్‌పైనే బ్యాన్‌ విధిస్తున్నాయ్‌. తాజాగా పుతిన్‌కు టిట్‌ ఫర్‌ టాట్‌ జవాబిచ్చారు కెనడా ప్రధాని ట్రూడో. తనపై విధించిన నిషేధానికి బదులుగా పుతిన్‌పై బ్యాన్‌ విధిస్తూ ప్రత్యేక బిల్లు తెచ్చారు. పుతిన్‌తోపాటు మరో వెయ్యి మంది రాజకీయ నేతలు, ప్రముఖులు, ఉన్నతాధికారులపై బ్యాన్‌ విధిస్తున్నట్లు ప్రకటించింది. ఉక్రెయిన్‌ గడ్డపై రష్యన్ సైన్యం పాల్పడుతోన్న యుద్ధ నేరాలకు ప్రతిగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఏదో కేవలం నోటి మాటతో కాదు, ఏకంగా ప్రత్యేక బిల్లును ప్రవేశపెట్టిమరీ పుతిన్‌ బ్యాన్‌కు ఆమోదం తెలిపింది కెనడా. ఉక్రెయిన్‌కు మద్దతుగా కెనడా ప్రధాని ట్రూడో కీవ్‌లో పర్యటించడంతో రష్యాతో దూరం పెరిగింది. దాంతో, ట్రూడోపాటు 6వందల మంది కెనడా ప్రముఖులపై రష్యా నిషేధం విధించింది. ఇప్పుడు దానికి ప్రతిగానే పుతిన్‌పై బ్యాన్‌ ప్రకటించింది కెనడా.

మరోవైపు, రష్యా హెచ్చరికలను పట్టించుకోకుండా నాటో సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకున్నాయ్‌ స్వీడన్ అండ్ ఫిన్లాండ్‌. నాటోలో చేరాలనుకుంటే ఉక్రెయిన్‌కు పట్టిన గతే మీకూ పడుతుందన్న పుతిన్‌ వార్నింగ్‌ను లెక్క చేయకుండా నాటో మెంబర్‌షిప్‌ అప్లికేషన్‌పై స్వీడన్, ఫిన్లాండ్‌ సంతకాలు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. మరి, స్వీడన్, ఫిన్లాండ్‌ చర్యలకు రష్యా రియాక్షన్ ఎలాగుండనుందో చూడాలి.