WHO Team Wuhan: వూహాన్‌లో పర్యటిస్తున్న WHO శాస్త్రవేత్తల బృందం.. కరోనాపై గుట్టు విప్పేనా..?
WHO Team Wuhan: చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసింది. ఈ మహమ్మారి బారిన ఎందరో ప్రాణాలు విడిచారు. కోవిడ్ ప్రజల జీవన విధానంపై ...
WHO Team Wuhan: చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసింది. ఈ మహమ్మారి బారిన ఎందరో ప్రాణాలు విడిచారు. కోవిడ్ ప్రజల జీవన విధానంపై తీవ్రమైన దెబ్బ కొట్టింది. అయితే మొదట కరోనా చైనాలోని వూహాన్ వ్యాపించగా, ప్రపంచ దేశాలన్నింటికి చాపకింద నీరులా పాకింది. ఇంత పాపం మూటగట్టుకున్న చైనాపై ప్రపంచ దేశాలు సైతం దుమ్మెత్తి పోస్తున్నాయి. దేశాల్లో ఇలాంటి విపత్కర పరిస్థితులు రావడానికి చైనాయే కారణమని ఆరోపణలు గుప్పించాయి. ఐక్యరాజ్యసమితిలో సైతం ఫిర్యాదు చేశాయి.
ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందం చైనాలో పర్యటించి కరోనా మూలాలను వెలికి తీయాలని ప్రపంచ దేశాలు డబ్ల్యూహెచ్‌వో పై ఒత్తిడి తీసుకువచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) బృందం చైనాలో పర్యటిస్తోంది. గత పదిహేన రోజుల కిందటనే బయలుదేరగా, కరోనా నిబంధనల ప్రకారం బృందం సభ్యులు ఓ హోటల్‌లో క్వారంటైన్ అయ్యారు. ఇక క్వారంటైన్ గడువు ముగియడంతో మూడు రోజుల కిందట పర్యటన ప్రారంభించారు. కరోనాకు పుట్టినిల్లు అయిన వూహాన్‌లో పర్యటిస్తున్నారు బృందం సభ్యులు. కరోనా మూలాలను వెలికి తీసే పనిలో ఉంది శాస్త్రవేత్తల బృందం. కరోనాకు కేంద్ర బిందువు అయిన వూహాన్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. అయితే కరోనాకు వేదికగా మారిన అడవి జంతువుల మార్కెట్‌ను సందర్శించింది. దీంతో చైనా అధికారులు, పోలీసులు వెంట రాగా, శాస్త్రవేత్తల బృందం స్థానిక జైషాజు మార్కెట్‌ను పరిశీలించారు.
వూహాన్‌లో కీలక ఆస్పత్రుల సందర్శన
అలాగే సోమవారం వూహాన్ నగరంలోని రెండు కీలక ఆస్పత్రులను సందర్శించారు. ఓ ప్రాంతీయ వ్యాధుల నియంత్రణ కేంద్రాన్ని సైతం దర్శించి వివరాలు సేకరించారు. కరోనా వ్యాప్తి చెందిన తొలినాళ్లలో అక్కడి ఆస్పత్రులు చికిత్స అందించింది. అయితే చైనాలో కరోనా తగ్గుముఖం పట్టగా, మళ్లీ విజృంభిస్తోంది. వూహాన్‌లో కరోనా కేసులు తగ్గిపోయిన చాలా రోజుల తర్వాత ఒక్క జనవరి నెలలో రెండు వేలకుపైగా కొత్త కేసులు నమోదు కావడం మరింత ఆందోళనకు గురి చేస్తోంది. జనవరిలో విదేశాల నుంచి వచ్చిన వారిలో 435 మంది కరోనా బారిన పడ్డారు. వైరస్‌తో ఇద్దరు మృతి చెందారు. మూడు ప్రావిన్స్ ప్రాంతాల్లో సోమవారం 33 కొత్త కేసులు నమోదు అయ్యాయి.
ఇక కోవిడ్ రూపొందించిన ప్రయోశాల అంటూ అంతర్జాతీయ మీడియా ఆరోపించిన వూహాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, వూహాన్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ను శాస్త్రవేత్తల బృందం సందర్శించనుంది. కరోనా విషయంలో చైనాపై మొదటి నుంచి ఆరోపణలు వస్తుండగా, చైనా మాత్రం తప్పించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. అయితే ఒకే ఒక్కసారి వూహాన్‌ను సందర్శించడం ద్వారా శాస్త్రవేత్తలు కరోనా గుట్టును విప్పగలరా..? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. కొన్నాళ్లుగా నిరంతరాయంగా పరిశోధనలు జరిపితే తప్ప కరోనా పుట్టుక రహస్యాలను వెలికి తీయలేమనే అభిప్రాయం కూడా వ్యక్తం అవుతోంది. వివిధ జంతువుల నుంచి సేకరించిన జన్యు పదార్థం నమూనాలు, వ్యాధి వ్యాప్తికి సంబంధించి పూర్తి అధ్యయనాలు చేయాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
అయితే వ్యూహాన్‌లో డబ్ల్యూహెచ్‌వో పర్యటన సందర్భంగా పరిశోధకులు అన్ని రకాలుగా పరిశోధనలు కొనసాగిస్తున్నారు. అడవి జంతువులను వేటాడేవారి నుంచి వ్యాపారులకు, తద్వారా వూహాన్ నగరానికి వైరస్ చేరుకుని ఉండవచ్చని శాస్త్రవేత్తలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కూడా లోతుగా దర్యాప్తు చేపడుతున్నారు. కరోనా పుట్టుకకు సంబంధించి చైనా కూడా ఇప్పటి వరకు ఎన్నో వివరణలను ఇచ్చే ప్రయత్నం చేసింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ఆహార పదార్థాల ద్వారానే చైనాలోకి వైరస్ ప్రవేశించిందని వాదనలను ప్రపంచాన్ని నమ్మించలేకపోతోంది. ఈ వాదనలను అంతర్జాతీయ శాస్త్రవేత్తలు తోలిపుచ్చారు. కరోనానా మూలాలను వెలికి తీసేందుకు వూహాన్‌లో పర్యటిస్తున్న అంతర్జాతీయ ఆరోగ్య సంస్థ శాస్త్రవేత్తలు ఎలాంటి ఆధారాలు సేకరిస్తారో చూడాలి.
Also Read:
Working Days: ఇకపై వారాంత సెలవులు రెండు రోజులు కాదు మూడు రోజులు.. ఎక్కడో తెలుసా..?