AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delta Flight Video: గాల్లో ఎదురుగా దూసుకొచ్చిన యుద్ధ విమానం… డెల్టా ఎయిర్‌లైన్స్‌కు తృటిలో తప్పిన ప్రమాదం…

ఇటీవల వరుస విమాన ప్రమాద సంఘటనలు కలకలం రేపుతున్నాయి. ఆహ్మదాబాద్‌లో ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాదం తర్వాత ఈ వరుస సంఘటనల పట్ల విమాన ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. రోజు ఏదో ఒక చోట విమానాల్లో టెక్నికల్‌ ఇష్యూస్‌ వల్ల అర్థాంతరంగా ల్యాండ్‌ అవుతున్న సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఇక గాల్లో...

Delta Flight Video: గాల్లో ఎదురుగా దూసుకొచ్చిన యుద్ధ విమానం... డెల్టా ఎయిర్‌లైన్స్‌కు తృటిలో తప్పిన ప్రమాదం...
Delta Flight And Bomber
K Sammaiah
|

Updated on: Jul 21, 2025 | 10:49 AM

Share

ఇటీవల వరుస విమాన ప్రమాద సంఘటనలు కలకలం రేపుతున్నాయి. ఆహ్మదాబాద్‌లో ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాదం తర్వాత ఈ వరుస సంఘటనల పట్ల విమాన ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. రోజు ఏదో ఒక చోట విమానాల్లో టెక్నికల్‌ ఇష్యూస్‌ వల్ల అర్థాంతరంగా ల్యాండ్‌ అవుతున్న సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఇక గాల్లో పక్షులు ఢీకొనే సంఘటనలు సైతం ఈ మధ్య తరచుగా వినిపిస్తున్నాయి. అలాంటి సంఘటనే ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఎదురుగా వచ్చింది పక్షి అయితే పర్వాలేదనుకోవచ్చు. కానీ అది యుద్ధ విమానం. యస్‌.. డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానానికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఇటీవల మిన్నియాపొలిస్‌ నుంచి మైనట్‌కు వెళ్తున్న డెల్టా ఎయిర్‌లైన్స్‌ విమానానికి, బీ 52 బాంబర్‌ యుద్ధ విమానం ఎదురుగా దూసుకు వచ్చింది.

అయితే యుద్ధ విమానం తమకు ఎదురుగా వస్తున్నట్లు ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ నుంచి స్పష్టమైన ఆదేశాలు రాలేదని డెల్టా విమాన పైలట్ తెలిపారు. దీంతో ఆ సమయంలో ప్రమాదాన్ని తప్పించడానికి విమానాన్ని వేగంగా మరోవైపునకు మళ్లించినట్లు పేర్కొన్నారు. విమానం సురక్షితంగా ల్యాండ్‌ అయిన తర్వాత ఈ విషయాన్ని ప్రయాణికులకు చెప్పి వారిని క్షమాపణలు కోరామని పైల్‌ వివరించారు.

ప్రమాదం గురించి పైలట్‌ అనౌన్స్‌మెంట్‌ చేస్తున్న సమయంలో ఆడియో రికార్డు చేసిన ఓ ప్రయాణికురాలు దాన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో ఇది వైరల్‌గా మారింది. యుద్ధ విమానం ఒక్కసారిగా తమవైపు దూసుకురావడంతో విమానాన్ని వేగంగా మరోవైపు తిప్పినట్లు తెలిపారు. యుద్ధ విమానం గురించి సమాచారం ఇవ్వకపోవడం, రాడార్‌ వ్యవస్థ నుంచి సిగ్నల్‌ లేకపోవడం వల్ల ఇలా జరిగిందని అతడు వివరిస్తున్నట్లు ఆడియోలో ఉంది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

వీడియో చూడండి:

కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
కిలో లక్షల్లోనే.. భారత్‌లోనే అత్యంత ఖరీదైన కూరగాయ.. ఎలా..
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
ఏపీ టెట్‌ 2025 ఆన్సర్‌ కీ విడుదల.. ఫలితాలు ఎప్పుడంటే?
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఉత్తర్వులు జారీ!
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
ఆ ప్రొడ్యూసర్ రూమ్ కు పిలిచి.. బాంబ్ పేల్చిన బిగ్ బాస్ బ్యూటీ
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జనవరిలో జాబ్ క్యాలెండర్ 2026 విడుదల
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
ఏపీ vs తెలంగాణ: మళ్లీ మొదలైన నీళ్ల లొల్లి.. తగ్గేదే లేదంటున్న..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
తనూజ కంటే బెటర్.. అసలైన అర్హులు వేరే ఉన్నారు..
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఈ చెట్ల పెంపకంతో కోట్లల్లో లాభం..సాగు విధానం గురించి మీకు తెలుసా?
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఒక కిలోమీటరు నడవడానికి ఎన్ని అడుగులు వేయాలి..? 99శాతం మందికి..
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్
ఇంటర్‌ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ 2026 మారిందోచ్.. కొత్త షెడ్యూల్