AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Donald Trump Video: బరాక్‌ ఒబామా అరెస్ట్‌… ఏఐ వీడియో పోస్టు చేసిన ట్రంప్‌

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామాపై ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ సంచలన వీడియో తన ట్రూత్‌ ఖాతాలో పోస్టు చేశాడు. ఒబామా అరెస్టయినట్లు AI వీడియో షేర్‌ చేశాడు. AI వీడియోలో పక్కనే నవ్వుతున్న ఫోజులో ట్రంప్‌ కనిపిస్తున్నాడు. మాజీ అధ్యక్షుడిపై సంచలన ఆరోపణల వేళ...

Donald Trump Video: బరాక్‌ ఒబామా అరెస్ట్‌... ఏఐ వీడియో పోస్టు చేసిన ట్రంప్‌
Trump Ai Video On Obama Are
K Sammaiah
|

Updated on: Jul 21, 2025 | 10:21 AM

Share

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామాపై ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ సంచలన వీడియో తన ట్రూత్‌ ఖాతాలో పోస్టు చేశాడు. ఒబామా అరెస్టయినట్లు AI వీడియో షేర్‌ చేశాడు. AI వీడియోలో పక్కనే నవ్వుతున్న ఫోజులో ట్రంప్‌ కనిపిస్తున్నాడు. మాజీ అధ్యక్షుడిపై సంచలన ఆరోపణల వేళ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పోస్ట్‌ చేసిన ఓ వీడియో తీవ్ర వైరలవుతోంది. చట్టానికి ఎవరూ అతీతులు కాదంటూ పోస్ట్‌ పెట్టారు ట్రంప్‌. దాంతో పాటు ఆయన పోస్ట్‌ చేసిన వీడియో అగ్రరాజ్యంలో హాట్‌టాపిక్‌గా మారింది. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా అరెస్ట్‌ అయినట్లు ఏఐ వీడియోని తన ట్రూత్ ప్లాట్‌ఫారమ్‌లో పోస్ట్‌ చేశారు అమెరికా అధ్యక్షుడు. ఓవల్ ఆఫీసులో ట్రంప్‌తో భేటీ అయిన సందర్భంలో మాజీ అధ్యక్షుడు ఒబామాని ఎఫ్‌బీఐ అరెస్టు చేసినట్లుగా ఆ వీడియో ఉంది.

ఒబామా చేతుల్ని వెనక్కి విరిచి మరీ అధికారులు బేడీలు వేశారు. ఆ సమయంలో నవ్వుతూ కనిపించారు ట్రంప్‌. తర్వాత ఒబామా జైల్లో ఉన్నట్లు ఆ కల్పిత వీడియోలో ఉంది. మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామాపై అమెరికా నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ డైరెక్టర్‌ తులసీ గబ్బార్డ్‌ సంచలన ఆరోపణలకు దిగారు. 2016లో ట్రంప్‌ విజయం సాధించినప్పుడు ఒబామా ప్రభుత్వం కుట్రలకు తెర తీసిందని.. ఎన్నికల్లో రష్యా జోక్యంపై తప్పుడు ఇంటెలిజెన్స్‌ నివేదికలు తయారు చేయించారని ఆమె ఆరోపించారు.

తులసి గబ్బార్డ్‌ ఆరోపణలకు రిపబ్లికన్లు మద్దతు తెలుపుతూ.. ఆమెపై ప్రశంసలు గుప్పించారు. అయితే డెమోక్రట్లు మాత్రం రాజకీయ ప్రేరేపితమని, ఆధారరహితమని ఈ ఆరోపణలను కొట్టిపారేశారు. అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా మాత్రం ఇంకా స్పందించలేదు.

ఓవల్‌ ఆఫీసులో ఫెడరల్ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ అధికారులు ఒబామాను అరెస్టు చేస్తున్నట్లుగా ఏఐ సాయంతో రూపొందించిన వీడియో అది. ‘చట్టానికి ఎవరూ అతీతులు కారు’ అనే మెసేజ్‌ ఇస్తూ మాజీ అధ్యక్షుడిపై ట్రంప్‌ విమర్శలు గుప్పించారు. ఆ వీడియోలో తొలుత ఒబామా మాట్లాడుతూ.. ‘చట్టానికి అధ్యక్షుడు అతీతుడే’ అని అన్నట్లుగా ఉంది. ఆ వెంటనే పలువురు రాజకీయ నాయకులు ‘చట్టం కంటే ఎవరూ ఎక్కువ కాదు’ అని మాట్లాడినట్లు ఉంది.

చివరకు ఓవల్‌ ఆఫీసులో ట్రంప్‌, ఒబామా మాట్లాడుకుంటుండగా ఎఫ్‌బీఐ అధికారులు అక్కడికి వచ్చి మాజీ అధ్యక్షుడి చేతికి సంకెళ్లు వేసినట్లుగా ఈ వీడియోను రూపొందించారు. ఆ సమయంలో ట్రంప్‌ నవ్వుతూ ఉన్నారు. అనంతరం ఒబామా ఖైదీ దుస్తుల్లో జైల్లో కూర్చుని ఉన్నట్లు చూపించడంతో వీడియో ముగుస్తుంది.

ఈ వీడియోను ట్రంప్‌ తన ట్రూత్‌ సోషల్‌లో పోస్ట్ చేయగా.. ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్‌గా మారింది.

వీడియో చూడండి:

వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీకూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి వస్తుందా?
మీకూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి వస్తుందా?
Horoscope Today: పట్టుదలతో వారు అనుకున్నది పూర్తిచేస్తారు..
Horoscope Today: పట్టుదలతో వారు అనుకున్నది పూర్తిచేస్తారు..
దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
సీఎం పదవిపై ఎలాంటి సీక్రెట్‌ డీల్‌ లేదు..!
సీఎం పదవిపై ఎలాంటి సీక్రెట్‌ డీల్‌ లేదు..!
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కూతురిని చూశారా? తండ్రి సినిమా కోసం..
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కూతురిని చూశారా? తండ్రి సినిమా కోసం..