L&T: కాగ్నిజెంట్ లంచం కేసులో కీలక పరిణామం.. ఎల్ అండ్ టీ ఎండీ వాంగ్మూలం నమోదుకు అమెరికా ఆదేశాలు

కాగ్నిజెంట్ క్యాంపస్‌లను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీతో ప్రభుత్వ అధికారులకు లంచం ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై అమెరికా ప్రభుత్వం విచారణ కొనసాగిస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ కేసులో కీలక పరిమాణం చోటు చేసుకుంది. ఎల్‌ అండ్‌ టీ సంస్థ ద్వారా ప్రభుత్వ ఉద్యోగులకు లంచం ఇచ్చారా లేదా అన్నది నిరూపించుకోవాలని.. ఆ సంస్థ ఎండీ నారాయణన్ సుబ్రహ్మణ్యన్‌ను అమెరికా ప్రభుత్వం ఆదేశించింది.

L&T: కాగ్నిజెంట్ లంచం కేసులో కీలక పరిణామం.. ఎల్ అండ్ టీ ఎండీ వాంగ్మూలం నమోదుకు అమెరికా ఆదేశాలు
S N Subrahmanyan
Follow us
Narender Vaitla

| Edited By: Shaik Madar Saheb

Updated on: Aug 21, 2024 | 7:09 PM

అమెరికాకు చెందిన టెక్ దిగ్గజం కాగ్నిజెంట్ భారత దేశానికి చెందిన పలువురు ప్రభుత్వ అధికారులకు లంచం ఇచ్చిందన్న ఆరోపణలపై అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాగ్నిజెంట్ 2013- 2014లో భారత్‌లోని చెన్నైతోపాటు, పుణెలో తమ ఆఫీస్‌ క్యాంపస్‌ల నిర్మాణం వేగంగా పూర్తి కావాలనే ఉద్దేశంతో, త్వరగా అనుమతుల కోసం కొంతమంది ప్రభుత్వ అధికారులకు లంచం ఇచ్చారనేది ఆరోపణ.

ఇదిలా ఉంటే కాగ్నిజెంట్ క్యాంపస్‌లను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీతో ప్రభుత్వ అధికారులకు లంచం ఇచ్చారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దీనిపై అమెరికా ప్రభుత్వం విచారణ కొనసాగిస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ కేసులో కీలక పరిమాణం చోటు చేసుకుంది. ఎల్‌ అండ్‌ టీ సంస్థ ద్వారా ప్రభుత్వ ఉద్యోగులకు లంచం ఇచ్చారా లేదా అన్నది నిరూపించుకోవాలని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌ శేఖరిపురం నారాయణన్ సుబ్రహ్మణ్యన్‌ను అమెరికా ప్రభుత్వం ఆదేశించింది.

సుబ్రహ్మణ్యన్‌తో పాటు ఎల్‌ అండ్‌ టీకి చెందిన రమేస్‌ వడివేలు, ఆదిమూలం త్యాగరాజన్‌, బాలాజీ సుబ్రమనిన్‌, టి నందకుమార్‌లను అలాగే కాగ్నిజెంట్ మాజీ ఉద్యోగులు వెంకటేశన్‌ నటరాజన్‌, నాగ సుబ్రమణియన్‌ గోపాలకృష్ణన్‌ల వాంగ్మూలాన్ని కూడా అమెరికా ప్రభుత్వం కోరింది. న్యూజెన్సీ కోర్టులో దాఖలు చేసిన నివేదికను ఉటంకిస్తూ ఈ వ్యాఖ్యలు చేసిందని వార్తలు వస్తున్నాయి.

ఇదిలా ఉంటే అమెరికాకు చెందిన పౌరులు విదేశీ ప్రభుత్వ అధికారులకు అంచం ఇవ్వకూడదని అమెరికా చట్టం చెబుతోంది. ఈ చట్టాన్ని కాగ్నిజెంట్ ఉల్లంఘించిందన్న కారణంతోనే అమెరికా ప్రభుత్వం ఈ విచారణ చేపట్టింది. కాగ్నిజెంట్‌ సంస్థల నిర్మాణ సమయంలో ఈ సంస్థ 7,70,000 డాలర్లను ప్రభుత్వ అధికారులకు లంచంగా ఇచ్చారనే ప్రధాన ఆరోపణ ఎదుర్కొంది. 2016లో అమెరికాలోని మాతృ సంస్థ చేపట్టిన అంతర్గత ఆడిట్‌లో ఈ విషయం వెల్లడైంది. అయితే ఈ వ్యవహారాన్ని కప్పి పుచ్చేందుకు కాగ్నిజెంట్‌కు చెందిన కొందరు ఉద్యోగులు కొన్ని నకిలీ వోచర్లు, బిల్లును సృష్టించారని అప్పట్లో వార్తలు వచ్చాయి.

ఢిల్లీకి చెందిన పర్యావరణ కార్యకర్త, రిటైర్డ్‌ పోలీస్‌ అధికారి ప్రిత్‌పాల్‌ సింగ్‌ దాఖలు చేసిన ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో అవినీతి నిరోధక శాఖ దీనిపై విచారణ ప్రారంభించింది. పుణె కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు చట్టపరమైన చర్యలను ప్రారంభించారు. కాగ్నిజెంట్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ మాతృ సంస్థ, కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ కార్పొరేషన్‌కి వ్యతిరేకంగా.. అమెరికా సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ కమిషన్ (SEC) ద్వారా సింగ్ ఫిర్యాదును స్వీకరించారు. ఫారిన్‌ కరప్ట్‌ ప్రాక్టీస్‌ చట్టం ఉల్లంఘనగా కేసు విచారణ చేపట్టారు. అమెరికాలో అమలు చేసే ఈ చట్టం ప్రపంచవ్యాప్తంగా అమలవుతోంది. ఈ చట్టం ప్రకారం అమెరికాకు చెందిన సంస్థలు, విదేశాల్లో అధికారులకు లంచాలు ఇవ్వకూడదు. ఈ చట్టాన్ని ఉల్లంఘించారన్న కారణంతోనే అమెరికా ప్రభుత్వం దీన్ని సీరియస్‌గా తీసుకుంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి