FBI Screens US : పెద్దన్న జో ప్రమాణస్వీకారోత్సవానికి భారీ భద్రత.. అమెరికా చరిత్రలోనే ఇలా తొలిసారి
అగ్రరాజ్యం అమెరికాలో కొత్త అధ్యక్షుడు కొలువుదీరే సమయం ఆసన్నమవుతుంది. అధికార మార్పిడి సమయంలో రాజధాని వాషింగ్టన్ డిసీలో జరిగిన అల్లర్లను దృష్టిలో పెట్టుకుని ఆ ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రతను..
FBI Screens US : అగ్రరాజ్యం అమెరికాలో కొత్త అధ్యక్షుడు కొలువుదీరే సమయం ఆసన్నమవుతుంది. అధికార మార్పిడి సమయంలో రాజధాని వాషింగ్టన్ డిసీలో జరిగిన అల్లర్లను దృష్టిలో పెట్టుకుని ఆ ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాట్లు చేస్తున్నారు. జో బైడెన్ ప్రమాణ స్వీకార సమయంలో నిరసనలు మళ్ళీ చెలరేగే అవకాశం ఉందని భావిస్తున్న అధికారులు పటిష్ట బందోబస్తుని ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఆ ప్రాంతం మిలటరీ జోన్ ను తలపిస్తోంది.
భద్రతా బలగాల్లోని వారే నిరసనలకు కారణం అవుతారంటూ ఎఫ్‌బీఐ హెచ్చరించింది. దీంతో అధికారులు మరింత ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో దళాల్లో ప్రతి సభ్యుడు అత్యంత అప్రమత్తతతో వ్యవహరించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఈ నేపథ్యంలో వాషింగ్టన్‌లోని క్యాపిటల్ భవనం సహా ఇతర కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ భారీ బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. ఇనుప కంచెలను బిగించారు. స్థానిక పోలీసులతో సహా ఇప్పటికే 25,000 మందితో కూడిన నేషనల్ గార్డ్స్ దళం క్యాపిటల్ భవనం చుట్టూ పహారా కాస్తోంది.
బైడెన్ ప్రమాణస్వీకారోత్సవం సందర్భంగా ట్రంప్ మద్దతుదారులు పెద్ద ఎత్తున ఆందోళన చేసి ప్రమాదం ఉందని అమెరికా అత్యన్నత దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ హెచ్చరించడంతో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా దీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని వాషింగ్టన్ సీక్రెట్ సర్వీస్ స్పెషల్ ఏజెంట్ ఇన్‌ఛార్జి మాథ్యూ మిల్లర్ చెప్పారు. అమెరికా చరిత్రలో ఈ తరహా భద్రతా ఏర్పాట్లు ఎప్పుడూ జరగలేదని వెల్లడించారు. మరోవైపు న్యూయార్క్ నగరంలో నెలకొన్న ఆందోళనకర పరిస్థితుల దృష్ట్యా తమ ఔట్‌లెట్‌లను మూసివేస్తున్నట్లు స్టార్‌బక్స్ ప్రకటించింది.
Also Read: కొండకోనల్లో దారిలేని చోట అత్యవసర పరిస్థితుల్లో ఆపద్బంధువు బైక్ అంబులెన్స్