AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

US-Iran Peace Treaty: ముగిసిన యుద్ధం.. శాంతిఒప్పందం.. MoUలపై ఇరాన్-అమెరికా సంతకాలు!

US-Iran Peace Treaty: ప్రపంచమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. గత రెండు మూడు నెలలుగా పశ్చిమాసియాలో కమ్ముకున్న యుద్ద మేఘాలను తొలగించేందుకు ఇరాన్-అమెరికా చేపట్టిన శాంతి చర్చలు సఫలమయ్యాయి. దీంతో తాజాగా ఈ రెండి దేశాలు శాంతిఒప్పందంపై సంతకాలు చేశారు.

US-Iran Peace Treaty: ముగిసిన యుద్ధం.. శాంతిఒప్పందం.. MoUలపై ఇరాన్-అమెరికా సంతకాలు!
Us Iran Peace Treaty
Anand T
|

Updated on: Jun 18, 2026 | 8:00 AM

Share

మిడిలీస్ట్‌ను కుదిపేసిన ఇరాన్-అమెరికా యుద్ధానికి ముగింపు దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ యుద్ధ విరమణకు సంబంధించిన అవగాహన ఒప్పందంపై సంతకాలు చేసినట్లు వైట్ హౌస్ ప్రకటించింది. ఈ ఒప్పందంతో ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి తిరిగి తెరుచుకోనుంది. అయితే ఒప్పందాన్ని ఇజ్రాయెల్ పూర్తిగా అమలు చేస్తుందా లేదా అన్నదానిపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది.

ఈ ఒప్పందం తర్వాత ఇరాన్ ఒక ప్రకటన చేసింది. శాంతి ఒప్పందంపై చర్చలు పూర్తయ్యాని పేర్కొంది. ఒప్పంద అములుకు ఇది పరీక్ష సమయం అని తెలిపింది. అయితే ఈ రెండు దేశాల మధ్య దాదాపు 14 అంశాలపై రాజీ కుదిరినట్టు తెలుస్తోంది. ఈ 14 అంశాలకు ఏవి అని కూడా తాజాగా అమెరికా ప్రకటించింది. లెబనాన్‌తో పాటు అన్ని వైపులా సైనిక చర్యల నిలిపివేతకు అమెరికా అంగీకరించింది.ఇరాన్‌-అమెరికా తుది ఒప్పందానికి 60 రోజుల గడువు ఉంటుంది. పరస్పర అంగీకారంతో ఇరు దేశాలు ఈ గడువును పెంచుకోవచ్చు.

30 రోజుల్లో హర్మూజ్ దిగ్బంధనాన్ని పూర్తిగా ఎత్తివేసి, టోల్ లేకుండా ఇరాన్‌ నౌకలను అనుమతించాలి.. ఇరాన్‌ పునర్నిర్మాణ కోసం 300 బిలియన్ డాలర్ల నిధి ఏర్పాటు చేస్తారు. అణ్వాయుధాన్ని ఎప్పటికీ తయారు చేయకూడదని ఇరాన్ అంగీకరించింది. అలాగే ఆంక్షలు ఎత్తివేసే వరకు స్వేచ్ఛగా చమురు అమ్ముకునేందుకు అంగీకరించాలని ఇరాన్‌ కోరింది. అయితే ఈ మొత్తం 14 అంశాల్లో యురేనియం సంబంధించి ఎక్కడా ప్రస్థావన జరగలేనట్టు కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us