బలవంతంగా పిల్లలకు పచ్చబొట్లు వేశారు.. మళ్లీ చేరిపేసేందుకు చర్మాన్ని కత్తిరించారు..చివరికి
ఇద్దరు పిల్లలకు వారి కన్నతల్లి, సవతి తండ్రి బలవంతంగా పచ్చబొట్లు వేయించి చిత్రహింసలకు గురిచేసిన ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే టెక్సాస్‌కు చెందిన గన్నర్ ఫార్ అనే మహిళకు అయిదు, తొమ్మిదేళ్ల వయసున్న ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ఇద్దరు పిల్లలకు వారి కన్నతల్లి, సవతి తండ్రి బలవంతంగా పచ్చబొట్లు వేయించి చిత్రహింసలకు గురిచేసిన ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే టెక్సాస్‌కు చెందిన గన్నర్ ఫార్ అనే మహిళకు అయిదు, తొమ్మిదేళ్ల వయసున్న ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె భర్తతో విడిపోయి మేగాన్ మే ఫార్ అనే మరో వ్యక్తిని వివాహం చేసుకుని పిల్లలతో ఉంటోంది.అయితే ఆ పిల్లలిద్దరికి పచ్చబొట్టు వేయించాలని భావించారు. కానీ టాటూ వేసుకునేందుకు పిల్లలు ఇష్టపడలేదు.
దీంతో ఆ దంపతులు ఆ పిల్లల్ని తాడుతో కట్టేశారు. వాళ్లు ఏడుస్తుండగానే నోట్లో దుస్తులు కుక్కారు. కళ్లకు గంతలు కట్టారు. ఇలా ఒకరికి భుజంపై, మరొకరికి కాలుపై పచ్చబొట్లు పొడిచారు. అయితే పిల్లలను చూడటానికి వారి సొంత తండ్రి రావడంతో ఈ దారుణం బయటపడింది. పోలీసులు తమను అరెస్టు చేస్తారని గన్నర్, మెగాన్ భయపడ్డారు. పిల్లలు పచ్చబొట్లు చేరిపేసేందుకు నిమ్మరసంతో రుద్దడం, గీరడం వంటివి చేశారు. అయినా ఆ పచ్చబొట్లు చెరిగిపోలేదు. చివరికి పిల్లల చర్మాన్ని కత్తిరించి పచ్చబొట్లను తొలగించారు. చివరికి పోలీసులు చిన్నారులను పరిశీలించగా వారి శరీరంపై లోతుగా గాయాలు కనిపించాయి. వెంటనే బలవంతంగా పచ్చబొట్లు వేసి కత్తిరించినందుకు ఆ జంటను అరెస్టు చేసి, విచారణ కొనసాగిస్తున్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.