H-1B Visa: యుఎస్ వీసాల కోసం భారత్ నుంచి భారీ డిమాండ్.. ఈ ఏడాదిలో 1 మిలియన్ అప్లికేషన్స్ వచ్చాయన్న యుఎస్ రాయబారి
ఇండియా-అమెరికా అనే తేడా లేదు. రెండు దేశాలు విద్య, సాంస్కృతికంగా దాదాపు కలిసిపోయాయి. రీసెంట్‌గా తెలుగుపాట నాటు-నాటుకు సాంగ్‌కి అంతర్జాతీయస్థాయి గుర్తింపు వచ్చింది. ఇండియన్ కల్చర్, కళలకు పెరుగుతున్న ప్రాధాన్యత అర్థం చేసుకోవచ్చు.
భారత్-అమెరికా రెండు దేశాల మధ్య ప్రజల సంబంధాలు చాలా బలంగా ఉన్నాయి. చిరకాల స్నేహం కొనసాగుతోంది. ప్రస్తుత పరిస్థితులు ఇరుదేశాలు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లేందుకు ఉపయోగపడతాయి. తెలుగు కవి శ్రీశ్రీ చెప్పినట్లు..మరో ప్రపంచం పిలిచింది..పదండి ముందుకు..పదండి తోసుకుపోదాం పైపైకి అన్నట్లు ఉంది. ఇండియా-అమెరికా అనే తేడా లేదు. రెండు దేశాలు విద్య, సాంస్కృతికంగా దాదాపు కలిసిపోయాయి. రీసెంట్‌గా తెలుగుపాట నాటు-నాటుకు సాంగ్‌కి అంతర్జాతీయస్థాయి గుర్తింపు వచ్చింది. ఇండియన్ కల్చర్, కళలకు పెరుగుతున్న ప్రాధాన్యత అర్థం చేసుకోవచ్చు. వీసాలపై భారత్ నుండి పెద్దయెత్తున డిమాండ్ ఉంది. ఈ ఇయర్ 1 మిలియన్ అప్లికేషన్స్ వచ్చాయి. H1B1 వీసాపై దృష్టి సారించామని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి చెప్పారు.
అంతేకాదు ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్‌గా పరిగణించబడుతున్న టి-హబ్‌ను సందర్శించిన అనంతరం అంబాసిడర్ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, “ హైదరాబాద్ తనను ఆకర్షించిందని చెప్పారు. మీరు భవిష్యత్తును అందంగా నిర్మించాలనుకుంటే ఆ భవిష్యత్ ఇక్కడే హైదరాబాద్‌లో ఉందన్నారు. హైదరాబాద్‌లో సరికొత్త US కాన్సులేట్‌ను ప్రారంభించడం పట్ల అమెరికా ప్రభుత్వం గర్వంగా ఉందన్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..