Russia Ukraine War: 67వ రోజులుగా ఆగని రష్యా ఉక్రెయిన్ యుద్ధం.. రష్యా రాకెట్ దాడిలో ఒడెస్సా రన్‌వే ధ్వంసం
67వ రోజులు దాటిన ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం కొనసాగుతోంది. తాజాగా రష్యా రాకెట్ దాడికి పాల్పడింది. ఉక్రెయిన్‌లోని ఒడెస్సా ఎయిర్‌పోర్టు రన్‌వే పూర్తిగా ధ్వంసం అయ్యింది.
Russia Ukraine Crisis: 67వ రోజులు దాటిన ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం కొనసాగుతోంది. తాజాగా రష్యా రాకెట్ దాడికి పాల్పడింది. ఉక్రెయిన్‌లోని ఒడెస్సా ఎయిర్‌పోర్టు రన్‌వే పూర్తిగా ధ్వంసం అయ్యింది. రష్యా రాకెట్ దాడి ఉక్రెయిన్ దేశంలోనే మూడవ అతిపెద్ద నగరం ఒడెస్సాలోని విమానాశ్రయ రన్‌వేతో పాటు నల్ల సముద్రపు ఓడరేవును దెబ్బతీసింది. ఉక్రెయిన్ సైన్యం శనివారం ఈ సమాచారాన్ని ఇచ్చింది. రాకెట్ దాడి తర్వాత ఒడెస్సా రన్‌వే ఇకపై ఉపయోగించకూడదని ఉక్రెయిన్ ఆపరేషనల్ కమాండ్ సౌత్ టెలిగ్రామ్‌లోని ఒక పోస్ట్‌లో తెలిపింది.
ఉక్రెయిన్ వార్తా కమిటీ UNIAN ఆర్మీ మూలాలు వెల్లడించిన ప్రకారం.. స్థానిక అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. సురక్షిత ప్రదేశాల్లో తలదాచుకోవాలని కోరింది. శనివారం ఒడెస్సాలో పలు పేలుళ్లు వినిపించాయి. రష్యా ఆక్రమిత క్రిమియా నుంచి రాకెట్లను ప్రయోగించినట్లు ఒడెస్సా ప్రాంతీయ గవర్నర్ తెలిపారు. అయితే, ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు నివేదిక అందలేదని తెలిపారు.
ఇదిలావుంటే, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ మాట్లాడుతూ యుక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి మాస్కో ఒక మిలియన్ కంటే ఎక్కువ మంది ప్రజలను ఖాళీ చేయించింది. చైనా అధికారిక వార్తా సంస్థ జిన్హువాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో లావ్రోవ్ ఈ విషయాన్ని తెలిపారు. మాస్కో ఉక్రెయిన్‌లను బలవంతంగా దేశం నుంచి పంపిస్తోందని ఉక్రెయిన్ ఆరోపిస్తున్న తరుణంలో లావ్‌రోవ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
ఈ సంఖ్యలో 300 మందికి పైగా చైనా పౌరులు ఉన్నారని లావ్రోవ్ చెప్పారు. కానీ, అతను తన వాదనకు మద్దతుగా ఎలాంటి ఆధారాలు అందించలేదు. మరోవైపు, రష్యా ఉక్రెయిన్ మధ్య చర్చలు ప్రతిరోజూ జరుగుతున్నాయని కూడా ఆయన చెప్పారు. అయినప్పటికీ, ఈ విషయంలో పురోగతి అంత సులభం కాదని హెచ్చరించారు. లావ్రోవ్ చర్చలకు అంతరాయం కలిగించడానికి కీవ్ పాలన పాశ్చాత్య మద్దతుదారులచే దూకుడు వాక్చాతుర్యాన్ని, రెచ్చగొట్టే చర్యలను మానుకోవాలని హితవు పలికారు.
Read Also…
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం