AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వీసాల్లో ఇంగ్లాండ్‌ కొత్త రూల్స్‌ అమల్లోకి తీసుకురాబోతోందా?

వీసాల్లో ఇంగ్లాండ్‌ కొత్త రూల్స్‌ అమల్లోకి తీసుకురాబోతోందా?.. సాధారణ వీసాల స్థానంలో ఈ-వీసాలను తెరపైకి తెస్తుందా?.. ఇమ్మిగ్రేషన్‌ వ్యవస్థనూ ప్రక్షాళన చేయబోతుందా?.. ఇంతకీ.. అసలేంటీ ఇంగ్లాండ్‌ ఈ-వీసా విధానం?... ఎప్పటినుంచి అమల్లోకి రాబోతోంది?... సాధారణ వీసాలకు, ఈ-వీసాలకు తేడా ఏంటి ?..

వీసాల్లో ఇంగ్లాండ్‌ కొత్త రూల్స్‌ అమల్లోకి తీసుకురాబోతోందా?
E visas
Ram Naramaneni
|

Updated on: Jul 13, 2025 | 9:40 PM

Share

యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో రేపటి నుంచి సాధారణ వీసాల స్థానంలో ఈ-వీసాలు అమల్లోకి రానున్నాయి. ఇమిగ్రేషన్‌ వ్యవస్థలోని భారీ మార్పుల్లో భాగంగా ఈ-వీసాలను తీసుకొస్తోంది. ఫలితంగా.. రేపటి నుంచి జారీ అయ్యే అన్ని వీసాలు వాటిని పొందేవారి పాస్‌పోర్టులతో లింకై.. డిజిటల్‌ రూపంలో ఉండనున్నాయి. వాస్తవానికి.. యూకేలో విద్యాభ్యాసం చేసే వారిలో భారతీయుల సంఖ్యే ఎక్కువ. ఇమిగ్రేషన్‌ ప్రాసెస్‌ను గాడిలో పెట్టేందుకు ఈ సరికొత్త వీసాలను అమల్లోకి తెస్తోంది. ఈ-వీసా రూల్‌తో విద్యార్థులు కచ్చితంగా తమ డిజిటల్‌, ప్రొసీజర్‌ అంశాలను ప్రయాణానికి ముందే చెక్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

వీసా విగ్నైట్‌ నిలిపివేసి.. కొత్తగా ఈ-వీసా జారీ

సరికొత్త విధానంతో పాస్‌పోర్టుపై సంప్రదాయ వీసా విగ్నైట్‌ను నిలిపివేసి.. దీనికి బదులు ఈ-వీసా జారీ చేయనుంది యూకే. ఇది డిజిటల్‌ ఇమిగ్రేషన్‌ హోదాను అందిస్తుంది. ఈ-వీసాల్లో విద్యార్థులు అప్‌డేట్‌ చేసిన పర్సనల్‌ పాస్‌పోర్టు వివరాలు కచ్చితంగా ఉండాలని స్పష్టం చేస్తోంది. పాస్‌పోర్టు రెన్యూవల్‌లో మార్పులు చేయాలనుకున్నా ఆయా వివరాలు తెలియజేయాల్సి ఉంటుంది. ఇక.. ఈ-వీసా జారీ నేపథ్యంలో ఇంగ్లాండ్‌ జర్నీ ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?.. అనేది పరిశీలిస్తే.. విద్యార్థులు కచ్చితంగా యూకే వీసా ఇమ్మిగ్రేషన్‌ అకౌంట్‌ క్రియేట్‌ చేసుకొని ఈ-వీసాను మేనేజ్‌ చేసుకోవాలి. వీసా వివరాలు, అప్‌డేట్‌ ఇన్ఫర్మేషన్‌, ఇమిగ్రేషన్‌ స్టేటస్‌ సమాచారం ఆయా విద్యాసంస్థలకు, యజమానులకు, కంపెనీలకు తెలియజేసేందుకు ఉపయోగపడుతుంది.

లాగిన్‌ క్రెడెన్షియల్స్‌, కాంటాక్ట్‌ డిటైల్స్‌ జాగ్రత్త

యూకే ఈ-వీసా అప్‌డేట్‌ నేపథ్యంలో విద్యార్థులు లాగిన్‌ క్రెడెన్షియల్స్‌, కాంటాక్ట్‌ డిటైల్స్‌ను జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. విద్యార్థులు యూకేలో బస చేసేందుకు, కోర్సుల్లో రిజిస్టర్‌ చేసుకునే సమయాల్లో.. ఆయా కంపెనీలు, ల్యాండ్‌ లార్డ్స్‌, విశ్వవిద్యాలయాలు యూకేవీఐ అకౌంట్స్‌ను తనిఖీ చేయాల్సి ఉంటుంది. అయితే.. ఈవీసా జారీ అయినా.. విద్యార్థులు మాత్రం తమ పాస్‌పోర్టును, ప్రింటెడ్‌ లేదా డిజిటల్‌ వీసా కాపీలను తమతో ఉంచుకోవాలి. బోర్డర్‌ ఆఫీసర్లు పాస్‌పోర్టును స్కాన్‌ చేసి ఈవీసాను తనిఖీ చేసేందుకు వీలు ఉంటుంది. ఇక.. వీసా జారీ అయ్యాక.. పాస్‌పోర్టును రెన్యూవల్‌ చేస్తే.. ఆ వివరాలను విద్యార్థులు తమ ఇంగ్లాండ్‌ జర్నీకి ముందే తమ యుకేవీఐ అకౌంట్స్‌లో అప్‌డేట్‌ చేయాలి. మొత్తంగా.. మోడ్రన్‌ టెక్నాలజీ అనుగుణంగా వీసాల్లో ఇంగ్లాండ్‌ సరికొత్త రూల్స్‌ అమల్లోకి తీసుకొస్తోంది. ఈ నేపథ్యంలోనే.. ఈ-వీసా విషయంలో ఇంగ్లాండ్‌ వెళ్లే విద్యార్థులు అలెర్ట్‌ కావాల్సి ఉంది.