Tsunami Warning: హిందూ మహాసముద్రంలో భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..
Tsunami Warning: తూర్పు తైమూర్ తీర ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. 6.4 తీవ్రతతో భూకంపం సంభవించిందని యూరోపియన్ మెడిటరేనియన్ సిస్మోలాజికల్..
Tsunami Warning: తూర్పు తైమూర్ తీర ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. 6.4 తీవ్రతతో భూకంపం సంభవించిందని యూరోపియన్ మెడిటరేనియన్ సిస్మోలాజికల్ సెంటర్(EMSC) వెల్లడించింది. కాగా, ఈ భూ ప్రకంపనలు కారణంగా తైమూర్ రాజధాని దిలీలోని భవనాలు షేక్ అయ్యాయి. దాంతో అక్కడి ప్రజలు హడలిపోయారు. ఇళ్లు వదలి రోడ్లపైకి పరుగులు తీశారు. ఆస్తి నష్టం, ప్రాణ నష్టానికి సంబంధించి అధికారిక సమాచారం లేనప్పటికీ.. భూకంపం చాలా బలంగా సంభవించినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
అయితే, ఈ భూకంపం హిందూ మహాసముద్రంలో సునామీని సృష్టించే అవకాశం ఉందని హిందూ మహాసముద్రం సునామీ హెచ్చరక, నియంత్రణ వ్యవస్థ(IOTWMS) హెచ్చరికలు జారీ చేసింది. అయితే, ఇండోనేషియా వాతావరణ, జియోఫిజిక్స్ ఏజెన్సీ(BMKG) మాత్రం సునామీపై భిన్నాభిప్రాయం వ్యక్తం చేసింది. సునామీ సంభవించకపోవచ్చని పేర్కొంది. ఇక USGS ప్రకారం.. తూర్పు తైమూర్ తూర్పు దిశ నుంచి 51.4 కిలోమీటర్లు(32 మైళ్లు) లోతులో భూకంపం సంభవించిందని పేర్కొంది.