ఇండియా డ్రగ్స్ కంట్రీ-ట్రంప్

ఇండియా డ్రగ్స్ కంట్రీ-ట్రంప్

భారత్ పై ట్రంప్ మరోసారి నోరు పారేసుకున్నారు. డ్రగ్స్ సరఫరా చేసే 20 ప్రధాన దేశాల సరసన ఇండియాను కూడా చేర్చారు. బహమాస్, బొలీవియా, పాకిస్తాన్, ఆప్ఘనిస్తాన్, పనామా, మెక్సికో, గ్వాటెమాలా, పెరూ, జమైకా, వెనిజులా ఇలాంటి 20 దేశాల్లో భారత్ కూడా ఉందంటూ ఆ దేశ విదేశాంగమంత్రి మైక్ పాంపియోకు నివేదిక సమర్పించారు. అంతర్జాతీయ కౌంటర్ మాదక ద్రవ్యాల ఒప్పందాల ప్రకారం తమ బాధ్యతలను పాటించడంలో బొలీవియా, వెనిజులా విఫలమయ్యాయని తెలిపారు. కొలంబియాలో కోకా, కొకైన్ […]

Ravi Kiran

|

Aug 09, 2019 | 8:36 PM

భారత్ పై ట్రంప్ మరోసారి నోరు పారేసుకున్నారు. డ్రగ్స్ సరఫరా చేసే 20 ప్రధాన దేశాల సరసన ఇండియాను కూడా చేర్చారు. బహమాస్, బొలీవియా, పాకిస్తాన్, ఆప్ఘనిస్తాన్, పనామా, మెక్సికో, గ్వాటెమాలా, పెరూ, జమైకా, వెనిజులా ఇలాంటి 20 దేశాల్లో భారత్ కూడా ఉందంటూ ఆ దేశ విదేశాంగమంత్రి మైక్ పాంపియోకు నివేదిక సమర్పించారు. అంతర్జాతీయ కౌంటర్ మాదక ద్రవ్యాల ఒప్పందాల ప్రకారం తమ బాధ్యతలను పాటించడంలో బొలీవియా, వెనిజులా విఫలమయ్యాయని తెలిపారు. కొలంబియాలో కోకా, కొకైన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతోందని..దాన్ని అరికట్టేందుకు ఆ దేశంతో కలసి పనిచేస్తామన్నారు. 2023 చివరి నాటికి కోకా, కొకైన్ ల ఉత్పత్తిని సగానికి తగ్గించేలా ప్రణాళికలు రచిస్తున్నామన్నారు.

ప్రాణాంతక డ్రగ్స్ సరఫరాను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని..ఇందుకు మెక్సికో సహకారం అవసరమన్నారు. యూఎస్ లోకి ప్రవేశించే ప్రాణాంతక డ్రగ్స్ సరఫరాను అడ్డుకునేందుకు ఇంకా చర్యలు తీసుకోవలసిన అవసరముందన్నారు. కొలంబియా,వెనిజులాలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి మాదక ద్రవ్యాలను నిరోధించడానికి ఆ దేశంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. సరిహద్దులను బలోపేతం చేయడం, అక్రమ మాదకద్రవ్యాల వాడకాన్ని నివారించడానికి చాలా నిధులు కేటాయించిందని తెలిపారు. మాదక ద్రవ్యాల మహమ్మారిని తిప్పికొట్టడంలో పురోగతి సాధిస్తున్నాం. ఇంకా సాధించాల్సిన అవసరముందన్నారు. 2019లో 68వేల 557 డ్రగ్ డెత్ కేసులు నమోదయ్యాయని..2018 కంటే ఇవి ఎక్కువన్నారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu