తొలిసారిగా కోవిద్ ఎఫెక్ట్..పలువురు సీనియర్ అధికారులను తొలగించిన నార్త్ కొరియా నేత కిమ్ జోంగ్ ఉన్

ఉత్తర కొరియాలో ఇప్పటివరకు కోవిద్ బాధితులు..లేదా మరణాలకు సంబంధించిన వార్తలేవీ బయటి ప్రపంచానికి పొక్కలేదు. కానీ మొట్టమొదటిసారిగా దీని ప్రభావం ఈ దేశంలో ఉందని తేలింది. అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ పలువురు సీనియర్ అధికారులను తొలగించి

తొలిసారిగా కోవిద్ ఎఫెక్ట్..పలువురు సీనియర్ అధికారులను తొలగించిన నార్త్ కొరియా నేత కిమ్ జోంగ్ ఉన్
Kim Jong Un
Follow us
Umakanth Rao

| Edited By: Anil kumar poka

Updated on: Jun 30, 2021 | 12:08 PM

ఉత్తర కొరియాలో ఇప్పటివరకు కోవిద్ బాధితులు..లేదా మరణాలకు సంబంధించిన వార్తలేవీ బయటి ప్రపంచానికి పొక్కలేదు. కానీ మొట్టమొదటిసారిగా దీని ప్రభావం ఈ దేశంలో ఉందని తేలింది. అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ పలువురు సీనియర్ అధికారులను తొలగించి వారి స్థానంలో కొత్తవారిని నియమించడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. ఈ అధికారులు తమ విధులను నిర్లక్ష్యం చేశారని, దేశ ప్రజల రక్షణ విషయంలో పెను సంక్షోభానికి కారకులయ్యారని..వీరి కారణంగా దేశంలో తీవ్ర పరిణామాలు ఏర్పడ్డాయని తమ పొలిట్ బ్యూరో సమావేశంలో ఆయన వ్యాఖ్యానించినట్టు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. వీరి బాధ్యతా రాహిత్యం, సామర్థ్య లోపం ప్రధాన లక్ష్యాల అమలును దెబ్బ తీశాయని..స్వీయ రక్షణ, ఉదాసీనత వారిలో పెరిగాయని ఆయన ఆరోపించినట్టు సమాచారం. మంగళవారం పాలక వర్కర్స్ పార్టీ, పొలిట్ బ్యూరో ప్రిసీడియం సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఆయన.. అధికారుల బదిలీ, కొత్త్తవారి నియామకాల గురించి ప్రకటించారు.

మొత్తానికి నార్త్ కొరియాలో కోవిద్ కేసులు ఉన్నాయని ధృవీకరించినట్టు అయిందని ఈ పరిణామాలను పరిశీలించిన ఓ విశ్లేషకుడు తెలిపారు. బహుశా ఈ దేశానికి ఇప్పుడు అంతర్జాతీయ దేశాల సహాయం అవసరమవుతుందని భావిస్తున్నానని ఆయన చెప్పాడు. కోవిద్ పాండమిక్ నుంచి తమను తాము రక్షించుకోవడానికి నార్త్ కొరియా గత జనవరిలోనే ఇతర దేశాలతో గల తన సరిహద్దులను మూసివేసింది. ముఖ్యంగా పొరుగున గల చైనాలో కోవిద్ కేసులు వెలుగులోకి వచ్చినట్టు తెలియగానే ఈ చర్య తీసుకుంది. పైగా దేశంలో ఆహార కొరత తీవ్రంగా ఉందని కిమ్ ఇటీవల వ్యాఖ్యానించిన విషయం గమనార్హం.

మరిన్ని ఇక్కడ చూడండి: లీకైన హరిహర వీర మల్లు పవన్ కళ్యాణ్ ఫైట్ సీన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్:Hara Hara Veera Mallu video leaked

నెట్టింట్లో అరటిపండు తింటూ హల్ చల్ చేస్తున్న తొండ..వైరల్ అవుతున్న వీడియో : gecko eat banana viral video.

పెళ్లి పందిట్లో మైక్ ఆన్ లో ఉండగ వధూవరుల ముచ్చట్లు వధూవరుల ముచ్చట్లు నెట్ లో హల్ చల్:Viral Video.

చిన్నారి నవ్వుకోసం కుక్క పిల్ల కుప్పి గంతులు..ట్రెండ్ అవుతున్న ఫన్నీ వీడియో :dog make fun viral video.