కోవాగ్జిన్ డీల్ కి స్వస్తి చెప్పిన బ్రెజిల్ ప్రభుత్వం…అధ్యక్షుడు జైర్ బోల్సనారో కి పొంచి ఉన్న పదవీ గండం ?
భారత బయో టెక్ కంపెనీ వారి కోవాగ్జిన్ వ్యాక్సిన్ కి సంబంధించిన డీల్ కి బ్రెజిల్ ప్రభుత్వం స్వస్తి చెప్పింది. 324 మిలియన్ డాలర్ల వ్యయంతో 20 మిలియన్ డోసుల టీకామందును కొనుగోలు చేయాలని మొదట గత ఫిబ్రవరిలో కుదుర్చుకున్న కాంట్రాక్టును రద్దు చేసుకున్నట్టు
భారత బయో టెక్ కంపెనీ వారి కోవాగ్జిన్ వ్యాక్సిన్ కి సంబంధించిన డీల్ కి బ్రెజిల్ ప్రభుత్వం స్వస్తి చెప్పింది. 324 మిలియన్ డాలర్ల వ్యయంతో 20 మిలియన్ డోసుల టీకామందును కొనుగోలు చేయాలని మొదట గత ఫిబ్రవరిలో కుదుర్చుకున్న కాంట్రాక్టును రద్దు చేసుకున్నట్టు ఆరోగ్య శాఖ మంత్రి మార్సెలో క్విరోగా తెలిపారు. ఈ ఒప్పందంలో అవకతవకలు జరిగాయని, అవినీతి జరిగిందని అధ్యక్షుడు జైర్ బోల్సనారో పై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఏమైనా సమగ్ర దర్యాప్తు ప్రారంభమైందని మార్సెలో మీడియాకు వెల్లడించారు. ఇదే మీడియా సమావేశంలో మాట్లాడిన ఫెడరల్ కంప్ట్రోలర్ జనరల్ (సీజీయూ) హెడ్ వాగ్నర్ రొసారియో ……ఈ కొనుగోలు ప్రాసెస్ పై ఇన్వెస్టిగేషన్ ప్రారంభమైందన్నారు. డీల్ విషయంలో ఫిర్యాదులు వచ్చినందున ముందు జాగ్రత్త చర్యగా ఈ కాంట్రాక్టును నిలిపివేస్తున్నామని..గతవారం ప్రాథమిక దర్యాప్తు మొదలైందని ఆయన చెప్పారు. 10 రోజుల్లోగా దీనిపై సమగ్ర విశ్లేషణ జరుగుతుందన్నారు. రెగ్యులేటరీ అప్రూవల్ కి ముందే హడావుడిగా ఈ ఒప్పందంపై చర్చలు జరిగినట్టు తెలుస్తోందని ఫెడరల్ ప్రాసిక్యూటర్లు తెలిపారు. బోల్సనారో ప్రభుత్వానికి, సింగపూర్ లోని బ్రెజిల్ కంపెనీ నీడ్ మెడిసిన్స్ కి మధ్య కుదిరిన ఈ డీల్ పై అనుమానపు నీలినీడలు పరచుకున్నాయి.
సెనెట్ పానెల్ కూడా దీనిపై దృష్టి పెట్టింది. కోవాగ్జిన్ వ్యాక్సిన్ అసలు బ్రెజిల్ కి చేరనే లేదని తెలిసింది. ఇది దిగుమతి అయినట్టు వచ్చిన వార్తలను నేషనల్ హెల్త్ సర్వేలెన్స్ ఏజెన్సీ తోసిపుచ్చింది. ఈ టీకామందు కొనుగోలులో అవకతవకలు జరిగినట్టు అధ్యక్షునికి ముందే తెలుసునని, కానీ దర్యాప్తునకు ఆదేశించకుండా ఈ విషయంలో విఫలమయ్యారని ముగ్గురు సెనేటర్లు ఆరోపించారు. కాగా కోవిద్ రెస్పాన్స్ పై ఇన్వెస్టిగేషన్ జరుపుతున్న సెనెట్ కమిటీని జైర్ బోల్సనారో తప్పు పట్టారు. ఇది తన ప్రభుత్వ తీరును కించపరుస్తోందన్నారు. ఏమైనా వ్యాక్సిన్ కొనుగోలు డీల్ లో అవినీతి ఈయన పదవికి ముప్పు తేవచ్చునని భావిస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: లీకైన హరిహర వీర మల్లు పవన్ కళ్యాణ్ ఫైట్ సీన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్:Hara Hara Veera Mallu video leaked
పెళ్లి పందిట్లో మైక్ ఆన్ లో ఉండగ వధూవరుల ముచ్చట్లు వధూవరుల ముచ్చట్లు నెట్ లో హల్ చల్:Viral Video.