కరోనా వ్యాధికి చికిత్స ఉండకపోవచ్చంటున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ

కరోనా వైరస్‌ విరుగుడు వ్యాక్సిన్‌ తయారీలో ప్రపంచం తలమునకలుగా ఉంటే... ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం ఆ మహమ్మారిని అంతం చేసే అద్భుతమైన ఔషధమేమీ లేదంటూ ఓ పిడుగులాంటి వ్యాఖ్య చేసింది

  • Balu
  • Publish Date - 9:09 am, Tue, 4 August 20
కరోనా వ్యాధికి చికిత్స ఉండకపోవచ్చంటున్న  ప్రపంచ ఆరోగ్య సంస్థ

The World Health Organization says corona disease is difficult to treat: కరోనా వైరస్‌ విరుగుడు వ్యాక్సిన్‌ తయారీలో ప్రపంచం తలమునకలుగా ఉంటే… ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం ఆ మహమ్మారిని అంతం చేసే అద్భుతమైన ఔషధమేమీ లేదంటూ ఓ పిడుగులాంటి వ్యాఖ్య చేసింది.. కరోనా వైరస్‌ను వ్యాప్తిచెందకుండా ఉండేందుకు మనమే జాగ్రత్తలు పాటించాలని హితవు చెప్పింది.. టెస్టింగ్‌, ట్రేసింగ్‌, భౌతికదూరాన్ని పాటించడం, మాస్క్‌లు ధరించడం వంటివాటిపై దృష్టి పెట్టాలంటూ అటు ప్రభుత్వాలకు, ఇటు ప్రజలకు విజ్ఞప్తి చేసింది.. ఇప్పటికిప్పుడైతే ఈ వైరస్‌ను అంతం చేసే చికిత్స ఏమీ లేదని, భవిష్యత్తులో కూడా ఉండకపోవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ ఘెబ్రిసియస్‌ తెలిపారు.

అసలీ వైరస్‌ మనుషుల్లోకి ఎలా ప్రవేశించిందన్న దానిపై వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ చైనాకు ఇద్దరు సభ్యులను పంపింది.. వారు తమ ప్రాథమిక విచారణను ముగించారని, త్వరలోనే వైరస్‌ మూలాలను కనిపెట్టేందుకు డబ్ల్యూహెచ్‌ఓ నేతృత్వంలోని ఓ బృందం చైనా పరిశోధకులతో కలిసి పని చేయనుందని ఘెబ్రిసియస్‌ చెప్పారు.