Donald Trump: ఇరాన్ ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులకు ట్రంప్ మద్దతు..!
ఇరాన్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొనసాగుతున్న నిరసనలు హింసాత్మకంగా మారాయి. రాజధాని టెహ్రాన్‌సహా పలు నగరాల్లో నిరసనకారులు వీధుల్లోకి వచ్చి ఆందోళనలకు దిగుతున్నారు. అయితే ఇరాన్‌లో పాలన మార్పును డిమాండ్ చేస్తున్న నిరసనకారులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బహిరంగంగా మద్దతు ప్రకటించారు

ఇరాన్‌లో పాలన మార్పును డిమాండ్ చేస్తున్న నిరసనకారులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బహిరంగంగా మద్దతు ప్రకటించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా స్వేచ్ఛ వైపు చూస్తున్న ఇరాన్‌కు సహాయం చేయడానికి అమెరికా సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. ట్రూత్ సోషల్‌లో ఒక పోస్ట్‌లో, “ఇరాన్ స్వేచ్ఛ వైపు చూస్తోందని, బహుశా గతంలో కంటే ఎక్కువగా. అమెరికా సహాయం చేయడానికి పూర్తిగా సిద్ధంగా ఉందన్నారు. ఇంతలో సెనేటర్ లిండ్సే గ్రాహం అమెరికా చర్య గురించి ఊహాగానాలకు మరింత ఆజ్యం పోశారు.
ఇరాన్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొనసాగుతున్న నిరసనలు హింసాత్మకంగా మారాయి. రాజధాని టెహ్రాన్‌సహా పలు నగరాల్లో నిరసనకారులు వీధుల్లోకి వచ్చి ఆందోళనలకు దిగుతున్నారు. ఈ క్రమంలోనే వారిని నియంత్రించే క్రమంలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ హింసాత్మక ఘటనల్లో పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఇరాన్‌లో నిరసనకారులకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మద్దతు ప్రకటించారు. అయితే తాజాగా అమెరికా సహాయం చేయడానికి సిద్ధంగా ఉందని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ బహుశా మునుపెన్నడూ లేని విధంగా స్వేచ్ఛ వైపు చూస్తోందని అన్నారు. ఈ మేరకు ట్రంప్ ట్రూత్ సోషల్‌లో పోస్టు చేశారు.
Investment Plan: కూలీ పనులు చేస్తూ కూడా లక్షాధికారి కావచ్చు.. ఇలా చేస్తే మీకు తిరుగుండదు!
అయితే ట్రంప్ ఇదివరకే ఇరాన్‌కు హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇరాన్ ప్రభుత్వం నిరసనకారులను చంపడం కొనసాగిస్తే అమెరికా జోక్యం చేసుకుంటుందని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. తాము పరిస్థితిని చాలా నిశితంగా గమనిస్తున్నామని, గతంలో చేసినట్లుగా వారు ప్రజలను చంపడం మొదలు పెడితే తాము జోక్యం చేసుకుంటామని అన్నారు. వారికి బాధ కలిగించే చోట తాము వారిని చాలా తీవ్రంగా దెబ్బతీస్తాము. అంటే సైన్యాన్ని పంపడం అని కాదు.. కానీ వారికి బాధ కలిగించే చోట చాలా గట్టిగా దెబ్బతీయడం అని అర్థం. అందుకే అది జరగాలని తాము కోరుకోడం లేదన్నారు ట్రంప్.
ఇది కూడా చదవండి: Bank Depositing: ఈ బ్యాంకులో రూ.2 లక్షలు డిపాజిట్ చేస్తే మీకు ఎంత వడ్డీ వస్తుందో తెలుసా?
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
