పాకిస్తాన్ లో మరో ‘డొనాల్డ్ ట్రంప్’ ! అచ్చు గుద్దినట్టు ఉన్నాడే ..! కానీ ఆయన ఏం చేస్తున్నాడో చూడండి !

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోలికలతోనే..అచ్చు గుద్దినట్టు అలాగే. ఓ పెద్ద మనిషి పాకిస్తాన్ లో ఉన్నాడు. సేమ్ టు సేమ్ ట్రంప్ మాదిరే ఉన్న ఆయన ఇంటర్నెట్ ను తెగ షేక్ చేస్తున్నాడు.

  • Publish Date - 6:12 pm, Wed, 16 June 21 Edited By: Phani CH
పాకిస్తాన్ లో మరో 'డొనాల్డ్ ట్రంప్'  ! అచ్చు గుద్దినట్టు ఉన్నాడే ..! కానీ ఆయన ఏం చేస్తున్నాడో చూడండి !
Donald Trump Look Like In P

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోలికలతోనే..అచ్చు గుద్దినట్టు అలాగే. ఓ పెద్ద మనిషి పాకిస్తాన్ లో ఉన్నాడు. సేమ్ టు సేమ్ ట్రంప్ మాదిరే ఉన్న ఆయన ఇంటర్నెట్ ను తెగ షేక్ చేస్తున్నాడు. ఇంతకీ ఆయన ఏం చేస్తున్నాడంటే.. తోపుడు బండి మీద ఐస్ క్రీమ్ లు, కుల్ఫీలు అమ్ముతున్నాడు. పాటలు కూడా పాడుతూ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న ఆయనను పాక్ లోని సాహీవాలీ ప్రాంతానికి చెందినవాడిగా గుర్తించారు.పాకిస్థాన్ సింగర్ షెహజాద్ రాయ్ ఇతని వీడియోను ఇన్స్ టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ..ఎవరైనా ఇతడిని తనతో కాంటాక్ట్ లోకి తీసుకురాగలరా అని అభ్యర్థించాడు. ఆ వ్యక్తి పట్ల అతని వివరాలు తెలుసుకునేందుకు తాను ఎంతో ఆసక్తి చూపుతున్నానని పేర్కొన్నారు. ఇది 23 సెకండ్ల వీడియో క్లిప్….కుర్తా, పైజామా ధరించి ఐస్ క్రీమ్ లు అమ్ముతున్న ఈ వ్యక్తి గొంతు కూడా దాదాపు ట్రంప్ స్వరం మాదిరే ఉంది. మామూలుగా కాకుండా పాటలు పాడుతూ కూడా తన అమ్మకాలను సాగిస్తుంటాడీయన. హైట్ కూడా సుమారు ట్రంప్ అంతే ఉంటాడని అంటున్నారు. ఇతని గొంతును చాలామంది ప్రశంసించడం కూడా విశేషమే..

ఈ వ్యక్తి పేరు ఏమిటో మాత్రం తెలియడంలేదు. ఈ వీడియోను చూసిన కొందరు..సరదాగా ‘ట్రంప్ ఇన్ పాకిస్తాన్ సెల్లింగ్ కుల్ఫీ'( ట్రంప్ పాకిస్తాన్ లో కుల్ఫీలు అమ్ముతున్నాడు) అని పేర్కొంటే..మరికొందరు..వావ్….. సేమ్ టు సేమ్ ట్రంప్ అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కొన్నేళ్ల క్రితం స్పెయిన్ లో బంగాళాదుంపలు పండించే ఓ రైతు కూడా ట్రంప్ పోలికలతోనే ఉండి సంచలనం రేపాడు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Backpain Relief Tips: వెన్నునొప్పితో ఇబ్బంది పడేవారు ఈ ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలట.. సూచిస్తున్న నిపుణులు..

Credit Incentives: ఆరోగ్య మౌలిక సదుపాయాలను పెంచడానికి 50 వేల కోట్ల రుణ ప్రోత్సాహకాలు ఇచ్చే దిశలో మోడీ ప్రభుత్వం