Indonesia: పెళ్లికి ముందు శృంగారం నిషేధం.. చట్టం తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు.. అతిక్రమిస్తే అంతే..
పెళ్లికి మందు శృంగారం చేయడం పలు దేశాల్లో నేరం. కొన్ని దేశాల్లో చట్ట ఆమోదం. సమాజంలోని పలు సంస్కృతుల్లో చాలా మందికి పెళ్లికి ముందే శృంగారం విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొందరు దీనిని..
పెళ్లికి మందు శృంగారం చేయడం పలు దేశాల్లో నేరం. కొన్ని దేశాల్లో చట్ట ఆమోదం. సమాజంలోని పలు సంస్కృతుల్లో చాలా మందికి పెళ్లికి ముందే శృంగారం విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొందరు దీనిని సమర్థిస్తే.. మరికొందరు వ్యతిరేకిస్తుంటారు. కానీ మారుతున్న లైఫ్ స్టైల్, సమాజంలో మార్పుల కారణంగా ఈ విషయంలో విపరీతమైన మార్పులు వచ్చాయి. ఈ క్రమంలోనే ఇండోనేషియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెండ్లికి ముందు శృంగారం చేస్తే ఏడాది జైలు శిక్ష విధించేలా కొత్త చట్టం తీసుకురానున్నట్లు వెల్లడించింది. త్వరలోనే ఈ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి చట్టంగా మార్చుకునేందుకు వేగంగా అడుగులు వేస్తున్నారు. అయితే ఈ విధానాన్ని గతంలోనే తీసుకువచ్చినా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. బిల్లు తమ స్వేచ్ఛ హక్కును హరిస్తుందని ఆందోళనకారులు తీవ్రంగా ఖండించారు. దీంతో ప్రభుత్వం వెనక్కు తగ్గింది. ఈ క్రమంలో తాజాగా కొత్త బిల్లును తీసుకొచ్చింది. ఇండోనేషియా విలువలను కాపాడేందుకు కొత్త చట్టాన్ని తీసుకురాబోతున్నామని ఆ దేశ డిప్యూటీ న్యాయమంత్రి ఎడ్వర్డ్ ఒమర్ షరీఫ్ హియారియేజ్ వివరించారు.
తాము తీసుకురానున్న ఈ చట్టాన్ని అతిక్రమిస్తే ఏడాదిపాటు జైలు శిక్ష లేదా భారీ జరిమానా విధిస్తారు. వీటికి సంబంధించిన క్రిమినల్ కోడ్ ముసాయిదా ను ఈ నెలలోనే పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఈ చట్టం ప్రకారం పెళ్లికి ముందు శృంగారం, సహజీవనం చేయడం నిషేధం. భార్య లేదా భర్త లేని వారితోనూ శృంగారంలో పాల్గొంటే వారిని వ్యభిచారం కింద శిక్షిస్తారు. గరిష్ఠంగా ఏడాది పాటు జైలు శిక్ష లేదా భారీ జరిమానా ఉంటుంది. ఇండోనేసియా పౌరులకే కాకుండా విదేశీయులకూ ఇవే నిబంధనలు వర్తిస్తాయి.
కాగా.. ఇండోనేషియాలో ముస్లిం జనాభా చాలా ఎక్కువ. అంతే కాకుండా ప్రపంచంలోనే అత్యధిక ముస్లిం జనాభా కలిగిన దేశంగా గుర్తింపు పొందింది. మహిళలు, స్వలింగ సంపర్కులపై ఎన్నో ఆంక్షలు విధించింది. దీనిపై ఆరోపణలు వస్తున్నా ఇండోనేషియా ప్రభుత్వం మాత్రం.. స్థానిక విలువలకు అనుగుణంగా నేర నియంత్రణ కోసం కొత్త చట్టాన్ని తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం చూడండి..