Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

America: గజగజ వణుకుతోన్న అగ్రరాజ్యం.. రికార్డు స్థాయిలో పడిపోయిన ఉష్ణోగ్రతలు..

అమెరికాలోని ఈశాన్య రాష్ట్రాల్లో చలి తీవ్రత మరింత పెరిగింది. కొన్ని ప్రాంతాల్లో మైనస్‌ 77 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదుతున్నాయంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. న్యూహ్యాంప్‌షైర్ మౌంట్ వాషింగ్టన్‌లో ఎమర్జెన్సీని ప్రకటించారు. మౌంట్‌ వాషింగ్టన్‌లో రికార్డు స్థాయిలో...

America: గజగజ వణుకుతోన్న అగ్రరాజ్యం.. రికార్డు స్థాయిలో పడిపోయిన ఉష్ణోగ్రతలు..
America Cold Weather
Follow us
Narender Vaitla

|

Updated on: Feb 04, 2023 | 9:05 PM

అమెరికాలోని ఈశాన్య రాష్ట్రాల్లో చలి తీవ్రత మరింత పెరిగింది. కొన్ని ప్రాంతాల్లో మైనస్‌ 77 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదుతున్నాయంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. న్యూహ్యాంప్‌షైర్ మౌంట్ వాషింగ్టన్‌లో ఎమర్జెన్సీని ప్రకటించారు. మౌంట్‌ వాషింగ్టన్‌లో రికార్డు స్థాయిలో -77 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత వారం రోజుల్లో మంచుతుఫాన్‌ కారణంగా అమెరికాలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. న్యూయార్క్ రాష్ట్రంలో అతిశీతల గాలులు వీస్తున్నాయి. విండ్ చిల్ వార్నింగ్ జారీ చేశారు.

మ‌సాచుసెట్స్‌, క‌న‌క్టిక‌ట్‌, రోడ్ ఐలాండ్‌, న్యూహ్యాంప్‌షైర్‌, వెర్మోంట్‌, మెయిన్ రాష్ట్రాల్లో 1.6 కోట్ల మంది చ‌లికి వ‌ణికిపోతున్నారు. కెనడాలో కూడా ఇదే పరిస్థితి ఉంది. క్యూబెక్‌ , ఒంటారియో లాంటి ప్రాంతాల్లో ఇళ్ల నుంచి బయటకు రావడానికి జనం భయపడుతున్నారు. మౌంట్ వాషింగ్ట‌న్ ప్రాంతంలో మైన‌స్ 76 డిగ్రీలు న‌మోదు అయిన‌ట్లు వాతావరణ శాఖ తెలిపింది. డీప్ ఫ్రీజ్ పరిస్థితులు మ‌రికొన్ని రోజులు ఉంటాయ‌ని, ఈశాన్య రాష్ట్రాల్లో వెద‌ర్ ప్రాణాంత‌కంగానే ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. బోస్టన్‌ , మ‌సాచుసెట్స్‌, న్యూ ఇంగ్లాండ్ లాంటి నగరాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు.

హైపోథ‌ర్మియా, ఫ్రోస్ట్‌బైట్ నుంచి త‌ప్పించుకునేందుకు ముందస్తుగా ఈ చ‌ర్యలు చేప‌ట్టారు. బోస్టన్‌ మేయ‌ర్ ఎమ‌ర్జెన్సీ వార్నింగ్ హెచ్చరికలను జారీ చేశారు. టెక్సాస్‌లో 2 లక్షల 50 వేల మంది కరెంట్‌ లేక అల్లాడిపోతున్నారు. 1980 తరువాత ఇలాంటి పరిస్థితి చూడలేదని స్థానికులు అంటున్నారు. ఆర్కిటిక ధృవ ప్రాంతం నుంచి వీస్తున్న శీతలగాలుల ప్రభావంతో అమెరికా , కెనడా రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో వేడి నీళ్లను గాలి లోకి విసిరితే మంచుగా మారిపోతోంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..