KTRకు అరుదైన గౌరవం.. బయో ఆసియా సదస్సులో పాల్గొననున్న తెలంగాణ మంత్రి

ఈ నెల 24న ప్రారంభం కానున్న బయో ఆసియా(Bio-asia) సదస్సులో మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌(Bill Gates) పాల్గొననున్నారు. 24, 25 తేదీల్లో వర్చువల్‌ విధానంలో ఈ సదస్సు జరగనుంది...

KTRకు అరుదైన గౌరవం.. బయో ఆసియా సదస్సులో పాల్గొననున్న తెలంగాణ మంత్రి
KTR
Follow us
Ganesh Mudavath

|

Updated on: Feb 19, 2022 | 12:37 PM

తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కు అరుదైన గౌరవం దక్కింది.  ఈ నెల 24న ప్రారంభం కానున్న బయో ఆసియా(Bio-asia) సదస్సులో ఆయన పాల్గొననున్నారు.  ఈ సదస్సుకు  మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌(Bill Gates) ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. 24, 25 తేదీల్లో వర్చువల్‌ విధానంలో ఈ సదస్సు జరగనుంది. కరోనాతో రెండేళ్లుగా నేర్చుకున్న పాఠాలు, ఆధునిక ఆరోగ్య రక్షణ విధానాలు, ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్య రక్షణ రంగం బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సదస్సులో చర్చించనున్నారు. బిల్‌ గేట్స్, అలెక్స్‌ గోర్సీక, జెఫ్‌మార్తా తో పాటు  మంత్రి కేటీఆర్‌.. ఈ సదస్సులో పాల్గొననున్నారు. దీనిపై స్పందించిన కేటీఆర్.. బిల్ గేట్స్ తో చర్చాగోష్ఠి కోసం ఉత్కంఠతో ఎదురుచూస్తున్నానన్నారు. జీవశాస్త్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న పరిస్థితిపై గేట్స్‌తో చర్చిస్తామని వెల్లడించారు.

‘ఆరోగ్య రక్షణ రంగంపై దృష్టిని కేంద్రీకరిస్తూ ప్రతీసారి జరిగే బయో ఆసియా సదస్సు సంబంధిత రంగాలకు చెందిన వారిని ఒకే గొడుగు కిందకు తీసుకొస్తోంది. 2022 సదస్సు కూడా ఈ పరంపరను కొనసాగిస్తోంది. బిల్‌గేట్స్, గోర్సీ్క, మార్తా వంటి దూరదృష్టి కలిగిన వారు సదస్సులో పాల్గొనడం లైఫ్‌ సైన్సెస్‌ పరిశ్రమకు మేలు చేస్తుంది’ మంత్రి కేటీ రామారావు ఒక ప్రకటనలో వివరించారు. 72 దేశాలకు చెందిన 31 వేల మంది ప్రతినిధులు వర్చువల్‌ విధానంలో ఈ సదస్సులో పాల్గొంటున్నారని బయో ఆసియా సీఈవో శక్తి నాగప్పన్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ చెప్పారు. ఈ అంతర్జాతీయ వేదిక భారతీయ బయోటెక్నాలజీ, లైఫ్‌ సైన్సెస్‌ రంగాలు విశ్వవ్యాప్తంగా పేరు సంపాదించేందుకు దోహదం చేస్తుందని అన్నారు.

అమెరికాకు చెందిన ప్రముఖ విశ్వవిద్యాలయం హార్వర్డ్‌.. ఆదివారం నిర్వహించే ‘హార్వర్డ్‌ భారత్‌’ దృశ్య మాధ్యమ సదస్సులో మంత్రి కేటీ రామారావు ప్రసంగించనున్నారు. ఈ సదస్సు శుక్రవారం ప్రారంభమైంది. ‘2030 భారత పురోగమన దశకం’ అనే అంశంపై మంత్రి మాట్లాడనున్నారు. తెలంగాణలో ఐటీ ఆధారిత వృద్ధి, మహిళా-కేంద్రీకృత వ్యాపార ఇంక్యుబేటర్లు తదితర అంశాలపై ఆయన తన ఆలోచనలను వివరించనున్నారు.

Also Read

Medaram Jathara 2022: నేటితో ముగియనున్న మేడారం జాతర.. అమ్మవార్లను దర్శించుకోనున్న గవర్నర్..

Sunny Leone: సన్నీ లియోన్‌కు కోపం తెప్పించిన కేటుగాడు.. కారణం ఏంటంటే

IND vs WI: రెండో టీ20లో టీమిండియా అద్భుత విజయం.. 2-0 తేడాతో సిరీస్ కైవసం..