నాటి ‘ టార్జాన్ ‘ స్టార్ రాన్ ఎలీ భార్య దారుణ హత్య..

నాటి ' టార్జాన్ ' స్టార్ రాన్ ఎలీ భార్య దారుణ హత్య..

1960 ప్రాంతాల్లో టీవీ సీరీస్ ‘ టార్జాన్ ‘ లో నటించి పాపులర్ అయిన రాన్ ఎలీ భార్య వలేరీ ఎలీ దారుణ హత్యకు గురయింది. 62 ఏళ్ళ ఆమెను ఈ దంపతుల కొడుకు కెమరూన్ ఎలీ కత్తితో పొడిచి హతమార్చాడు. కాలిఫోర్నియాలోని వీరి నివాసంలోనే ఈ దారుణం జరిగింది. 30 ఏళ్ళ కెమరూన్ ఎలీని ప్రమాదకరమైన వ్యక్తిగా భావించిన పోలీసులు అతడ్ని కాల్చి చంపారు. అసలు ఈ గొడవకు వీరి కుటుంబ కలహాలే కారణమని భావిస్తున్నారు. […]

Pardhasaradhi Peri

|

Oct 17, 2019 | 4:44 PM

1960 ప్రాంతాల్లో టీవీ సీరీస్ ‘ టార్జాన్ ‘ లో నటించి పాపులర్ అయిన రాన్ ఎలీ భార్య వలేరీ ఎలీ దారుణ హత్యకు గురయింది. 62 ఏళ్ళ ఆమెను ఈ దంపతుల కొడుకు కెమరూన్ ఎలీ కత్తితో పొడిచి హతమార్చాడు. కాలిఫోర్నియాలోని వీరి నివాసంలోనే ఈ దారుణం జరిగింది. 30 ఏళ్ళ కెమరూన్ ఎలీని ప్రమాదకరమైన వ్యక్తిగా భావించిన పోలీసులు అతడ్ని కాల్చి చంపారు. అసలు ఈ గొడవకు వీరి కుటుంబ కలహాలే కారణమని భావిస్తున్నారు. తన తల్లిని హత్య చేశాక కెమరూన్ ఇంటి బయటకు వెళ్లి దాక్కున్నాడని, అతని చేతిలో గన్ ఉండడంతో తమపై కాల్పులు జరపవచ్చునని భావించి తాము కాల్పులు జరపవలసి వచ్చిందని పోలీసులు చెబుతున్నారు. తన భార్యపై కొడుకు దాడి చేస్తున్నప్పుడు 81 ఏళ్ళ రాన్ ఎలీ గాయపడ్డాడా అన్న విషయం తెలియలేదు. అయితే ఆయనను పోలీసులు ఆసుపత్రికి తీసుకువెళ్లగా అక్కడ డాక్టర్లు పరీక్షించి చెకప్ అనంతరం డిశ్చార్జి చేశారని తెలుస్తోంది. వలేరీ మాజీ ‘మిస్ ఫ్లోరిడా ‘అని, ఈ దంపతులకు ముగ్గురు పిల్లలని పోలీసు వర్గాలు వెల్లడించాయి. 1966.. 1969 మధ్య కాలంలో ఎన్ బీ సీ, సీబీఎస్ టీవీ సీరీస్ లో రాన్ ఎలీ ‘ టార్జాన్ ‘ రోల్ లో నటించి పిల్లలను, పెద్దలను మెప్పించాడు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu