AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Afghanistan crisis: అమెరికా అధునాతన ఆయుధాలు, హెలికాప్టర్లు తాలిబన్ల చేతికి.. ఏం చేస్తారో చూడాలి..

అమెరికా ఆర్మీ ఉపయోగించిన బోలెడు ఆయుధాలు.. మందుగుండు సామగ్రి అక్కడే ఉండిపోయింది. ఇవన్నీ ఇప్పుడు అప్పనంగా తాలిబన్లు పరమాయ్యయి. ఆటవిక మూక ను తలపించే

Afghanistan crisis: అమెరికా అధునాతన ఆయుధాలు, హెలికాప్టర్లు తాలిబన్ల చేతికి.. ఏం చేస్తారో చూడాలి..
Taliban Forces Celebrating
Sanjay Kasula
|

Updated on: Aug 18, 2021 | 3:00 PM

Share

కాలకేయుల కబంధహస్తాల్లో చిక్కుకుని అఫ్గన్ బిక్కుబిక్కుమంటోంది. అంతా అనుకున్నట్లే జరిగింది.. ఆఫ్గన్‌లో మళ్లీ తాలిబన్ల రాజ్యం వచ్చింది. తాలిబన్లు అప్ఘానిస్తాన్ మొత్తాన్ని తమ గుప్పిట్లోకి తెచ్చుకున్నారు. ఊహించినదానికంటే వేగంగా కాబూల్‌ను స్వాధీనం చేసుకున్నారు తాలిబన్లు. తాలిబన్ల రాకతో అమెరికన్లు ఉన్నపలంగా పెద్ద ఎత్తున ఆయుధాలు, హెలికాప్టర్లు అక్కడే వదిలిపెట్టి వెళ్లిపోయారు. అమెరికా సైనిక శిభిరాలను సైతం ఆక్రమించిన తాలిబన్లు వాటి లెక్క తేల్చే పనిలో పడ్డారు. అత్యంత అధునాతమైన ఆయుధాలు వారి చేతికి చిక్కడంతో వాటి ఏం చేస్తారనే ప్రశ్న ఇప్పుడు ప్రపంచ దేశాల ఆలోచింప చేస్తోంది.

అమెరికా ఆర్మీ ఉపయోగించిన బోలెడు ఆయుధాలు.. మందుగుండు సామగ్రి అక్కడే ఉండిపోయింది. ఇవన్నీ ఇప్పుడు అప్పనంగా తాలిబన్లు పరమాయ్యయి. ఆటవిక మూక ను తలపించే ఈ ముఠాకు ఇప్పుడు తొలిసారిగా వైమానిక దళం కూడా సమకూరింది. అంతేకాదు.. ఆఫ్గాన్ జాతీయ రక్షణ భద్రత దళాల ANDSSకు పెద్ద సంఖ్యలో ఆయుధ వ్యవస్థలు, మందుగుండు సామాగ్రిని అమెరికా అందించింది.

తాలిబన్ల రాజ్యంలో మేముండలేమంటూ తలోదిక్కు పరుగెడుతున్నారు అఫ్గన్లు. తప్పు చేస్తే నరికేయడాలు, ఉరితీయడాలు.. అన్నీ మధ్యయుగం కాలం నాటి శిక్షలే.. వీటిని భరించాలా అంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పక్క దేశాలకు పారిపోతున్నారు. జాంబీస్ కన్నా తాలిబన్‌లు డేంజర్ అన్న భావనలో అప్ఘన్లు ఉన్నారు. యమలోకంలో ఎలాంటి శిక్షలుంటాయో తెలియదు కానీ.. తాలిబన్లకు చిక్కితే అంతకుమించి శిక్షలు ఉంటాయని వణికిపోతున్నారు.

ఆఫ్గనిస్తాన్‌ను స్వాధీనం చేసుకున్న మరుసటి రోజే తాలిబన్లు తమ ప్రతాపం చూపిస్తున్నారు. రాజధాని కాబూల్‌లో ఇంటింటిని గాలిస్తున్నారు. ప్రభుత్వ అధికారులు, పోలీసులు, ఎన్జీవో సిబ్బంది..భద్రతాసిబ్బంది, జర్నలిస్టులను గుర్తించేందుకు తనిఖీలు చేస్తున్నారు. 80 మంది ఆఫ్గన్‌ పౌరులను అదుపు లోకి తీసుకున్నారు. దీంతో భయం గుప్పిట్లో కాలం గడుపుతున్నారు కాబూల్‌ వాసులు. ప్రాణాలో పోయినా ఫర్వాలేదు.. తాలిబన్ల పాలన భరించలేం అంటే చాలామంది ఆఫ్గన్లు దేశం విడిచి పారిపోతున్నారు .

ఆఫ్గనిస్తాన్‌లో తాలిబన్లు తమ ప్రతాపం చూపిస్తున్నారు. రాజధాని కాబూల్‌లో ఇంటింటిని గాలిస్తున్నారు. ప్రభుత్వ అధికారులు, పోలీసులు, ఎన్జీవో సిబ్బంది..భద్రతాసిబ్బంది, జర్నలిస్టులను గుర్తించేందుకు తనిఖీలు చేస్తున్నారు. పలువురు ఆఫ్గన్‌ పౌరులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో భయం గుప్పిట్లో కాలం గడుపుతున్నారు కాబూల్‌ వాసులు. ఆఫ్ఘన్‌ను పూర్తిగా ఆక్రమించుకున్న తాలిబన్లు..విచ్చలవిడిగా తిరుగుతున్నారు. గన్నులతో వీధుల్లో హల్‌చల్‌ చేస్తున్నారు. ఎమ్యూజ్‌మెంట్‌ పార్కుల్లో ఎంజాయ్‌ చేస్తున్నారు. ఆర్మీ దుస్తులు ధరించి.. వీధుల్లో విచ్చల విడిగా తిరుగుతున్నారు.

ఇవి కూడా చదవండి: Bank Holidays: బ్యాంకుల్లో పనుంటే ఇవాళే ప్లాన్ చేసుకోండి.. రేపటి నుంచి ఐదు రోజులపాటు సెలవులు..

స్వాతంత్య్ర పోరాట యోధులంటూ తాలిబన్లకు ఎంపీ ప్రశంసలు.. కేసు నమోదు చేసిన పోలీసులు..