స్వాతంత్య్ర పోరాట యోధులంటూ తాలిబన్లకు ఎంపీ ప్రశంసలు.. కేసు నమోదు చేసిన పోలీసులు..
ఎప్పుడూ వివాదాస్పద ప్రకటనలతో వార్తల్లో ఉండే సమాజ్‌వాదీ పార్టీ సంబల్ ఎంపీ షఫీకుర్ రహమాన్ బుర్కే మరోసారి అంతకు మించిన స్థాయిలో కామెంట్స్ చేశారు. ఆయన తాలిబన్లకు అనుకూలం మాట్లాడటమే కాదు వారికి మద్దతు...
ఎప్పుడూ వివాదాస్పద ప్రకటనలతో వార్తల్లో ఉండే సమాజ్‌వాదీ పార్టీ సంబల్ ఎంపీ షఫీకుర్ రహమాన్ బుర్కే మరోసారి అంతకు మించిన స్థాయిలో కామెంట్స్ చేశారు. ఆయన తాలిబన్లకు అనుకూలంగా మాట్లాడడం వివాదాస్పదంగా మారింది. ఆయనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంభాల్ నియోజకర్గ MP షఫీక్ ఉర్ రెహ్మాన్ బర్ఖ్ తాజాగా అఫ్గాన్ పరిణామాలపై తాజాగా మీడియాతో మాట్లాడుతూ… అఫ్గాన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకోవడాన్ని భారత స్వాతంత్య్ర పోరాటంతో పోల్చారు షఫీకుర్ రహమాన్. భారతీయుల పోరాటం, తాలిబన్ల పోరాటం దాదాపు సమానమేనని అన్నారు. తాలిబన్లది ఒకరకంగా స్వాతంత్య్ర పోరాటమేనని అని ఆయన అభివర్ణించారు.
తమ దేశానికి స్వేచ్ఛ కావాలని తాలిబన్లు కోరుకున్నారని.. అనుకున్నది సాధించారని చెప్పారు. అయినా అదంతా అఫ్గానిస్తాన్ అంతర్గత వ్యవహారమని స్పష్టం చేశారు. సమాజ్‌వాదీ MP షఫీక్ ఉర్ వ్యాఖ్యలను CM యోగి ఆదిత్యనాథ్ తీవ్రంగా తప్పుపట్టారు. ప్రతిపక్ష MP సిగ్గులేకుండా తాలిబన్లను సమర్థిస్తున్నారని విమర్శించారు.
తాలిబన్లను సమర్థించడం అంటే వారి రాక్షసకాండను సైతం సమర్థించినట్లేనని అన్నారు. మానవత్వానికి మచ్చగా మారిన వారికి మద్దతుగా మాట్లాడుతున్నారంటే అసలు మనం ఎక్కడి వెళ్తున్నట్లు? అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎంపీ షఫీఖర్ రహమాన్ బుర్కేపై కేసు నమోదైంది
ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ల ఆక్రమణ సరైనదేనని సమర్థిస్తు మాట్లడటాన్ని సంభాల్ SP MP షఫీఖుర్ రహమాన్ బుర్కే . అతను దానిని ఆఫ్ఘనిస్తాన్ అంతర్గత విషయం అని అన్నారు. తాలిబన్లను ఓ శక్తిగా ఆయన అభివర్ణించారు. అమెరికా, రష్యా అక్కడ స్థిరపడటానికి తాలిబాన్లు అనుమతించలేదని అన్నారు. ఆఫ్ఘన్ ప్రజలు తాలిబాన్ నాయకత్వంలో స్వేచ్ఛ కోరుకుంటున్నారని ఎంపీ అన్నారు.
స్వాతంత్య్ర సమరయోధులను అవమానించినట్లు ఆరోపణలు
తాలిబాన్ ఉగ్రవాదులకు మద్దతు ఇస్తున్నట్లు SP MP షఫీఖుర్ రహమాన్ బుర్కే స్పష్టం చేశారు. భారతదేశ స్వాతంత్ర్య సమరయోధులతో తాలిబన్లను పోల్చినట్లుగా తెలుస్తోంది. సామాన్య ప్రజల మనోభావాలను దెబ్బతీసినందుకు స్వాతంత్ర్య సమరయోధులను అవమానించినందుకు BJP నాయకుడు అతనిపై కేసు పెట్టారు.
ఇవి కూడా చదవండి: Afghanistan Crisis: యాక్షన్.. రియాక్షన్.. తాలిబన్ల చెర నుంచి మరో నగరాన్ని స్వాధీనం చేసుకున్న ఆఫ్ఘన్ సైన్యం
Jana Ashirwad Yatra: ప్రజల ఆశీర్వాదం తీసుకునేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి జన యాత్ర..