Sunita Williams: సునీతా విలియమ్స్, విల్‌మోర్‌లను భూమికి తెచ్చేందుకు వెళ్లిన నౌక
ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో చిక్కుకుపోయిన వ్యోమగాముల కోసం... యావత్ ప్రపంచం ఇప్పుడు అంతరిక్షం వైపు చూస్తోంది. అసలు సునీతా విలియమ్స్, విల్‌మోర్ రిటర్న్ జర్నీకి నాసా ప్లాన్ B ఏంటి? వారు భూమికి ఎప్పుడు చేసుకుంటారు..?
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన భారత సంతతికి వ్యోమగామి సునీతా విలియమ్స్‌తో పాటు బుచ్ విల్‌మోర్‌లను తీసుకొచ్చేందుకు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభమైంది. ఫ్లోరిడాలోని కేప్ కెనవరాల్ నుంచి ఎలాన్ మస్క్ సంస్థ స్పేస్‌ఎక్స్‌కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ ఆదివారం నింగిలోకి దూసుకెళ్లింది. ఐఎస్ఎస్‌లో కొద్ది నెలలుగా చిక్కుకున్న సునీత్ విలియమ్స్, బుచ్ విల్‌మోర్‌లను తీసుకొచ్చేందుకు స్పేస్‌ఎక్స్ రాకెట్ బయలుదేరిందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా వెల్లడించింది. వ్యోమనౌకలో ఇద్దరు వ్యోమగాములు వెళ్లారని, మరో రెండు సీట్లు ఖాళీగా ఉన్నాయని తెలిపింది. తిరుగు ప్రయాణంలో ఐఎస్ఎస్ నుంచి విలియమ్స్, విల్‌మోర్‌లను తీసుకురానున్నారని తెలిపింది. నాసా వ్యోమగామి నిక్ హేగ్, రష్యాకు చెందిన కాస్మోనాట్ అలెగ్జాండర్ గోర్బునోవ్‌లు.. సునీత విలియమ్స్, బారీ బుచ్ విల్‌మోర్‌లకు అవసరమైన సరుకులతో ఆకాశంలోకి వెళ్లారు.
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సునీతా, విల్‌మోర్‌లను తిరిగి భూమి మీదకు తీసుకురావాలని భావిస్తున్నారు. బోయింగ్ కంపెనీ రూపొందించిన స్టార్‌లైనర్ అనే వ్యోమనౌకలో సునీతా, విల్‌మోర్‌లు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు. ఈ వ్యౌమనౌక ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు చేరుకోవడానికి ముందే అందులోని ప్రొపల్షన్ సిస్టమ్‌లో లీకులు ఏర్పడటం, థ్రస్టర్స్ మూసుకుపోవడం లాంటి సమస్యలు ఏర్పడ్డాయి. దీంతో8 రోజుల్లో వెనక్కి రావాల్సిన వ్యోమగాములు నెలల తరబడి ఐఎస్ఎస్‌లో చిక్కుకపోయారు.
ప్రొపల్షన్ వ్యవస్థలో లోపాన్ని సవరించి వారిని భూమిపైకి తీసుకువచ్చేందుకు నాసా అనేక ప్రయత్నాలు చేసింది. స్టార్‌లైనర్ ద్వారా 2, 3 సార్లు చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. దీంతో ఫలితంగా నాసా, ఎలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్ సాయం తీసుకోవాల్సి వచ్చింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..