కొంతమంది తమకు అవకాశాలు రావడం లేదంటూ నిరాశ నిసృహలతో బతికేస్తూ ఉంటారు. మరికొందరు.. కష్టపడి పని చేసి డబ్బులు సంపాదించాలని.. తమ ఆర్ధిక పరిస్థితిని మరింత మెరుగుపరచుకుంటారు. కొందరు చిన్న తనంలో జీవితం నేర్పిన ఆర్ధిక కష్టాల నుంచి పాఠాలు నేర్చుకుని భవిష్యత్ నిర్మాణానికి పునాదులుగా మార్చి చరిత్ర సృష్టిస్తూ ఎదుగుతారు. అలాంటి వ్యక్తిలో ఒకరు వాట్సాప్ సహ వ్యవస్థాపకుడు సీఈవో జాన్ కౌమ్. ప్రముఖ వ్యాపారవేత్త, మొబైల్ మెసేజింగ్ ప్రోగ్రామ్ అయిన WhatsApp సహ వ్యవస్థాపకుడు, CEO. ఫిబ్రవరి 2014న ఫేస్ బుక్ ను $19 బిలియన్లకు WhatsAppని కొనుగోలు చేయడంతో జాన్ కౌమ్ వ్యవస్థాపక రంగంలోని ప్రయాణం సరికొత్త శిఖరాలకు చేరుకుంది. 7.5 బిలియన్ల డాలర్లకు పైగా నికర విలువతో ఫోర్బ్స్ 2014 ఏడాదికి గాను అమెరికాలో 62వ అత్యంత సంపన్న వ్యక్తిగా జాన్ కౌమ్ ర్యాంక్ ను సొంతం చేసుకున్నాడు.
ఫిబ్రవరి 24, 1976న జాన్ కౌమ్ జన్మించారు. కుటుంబ నేపథ్యం కీవ్, ఉక్రెయిన్ దేశాల మారుమూల శివార్లలో ఉంది. సోవియట్ యూనియన్ పాలనలో గ్రామీణ ప్రాంతంలో యూదలకు అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో జాన్ కౌమ్ బాల్యం కష్టాల మయం. స్నానానికి వేడినీరు, విద్యుత్ వంటి ప్రాథమిక సౌకర్యాలు కూడా లేవు. ఫ్యామిలీలో కష్టాలు అని జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి.
ఈ సమయంలో జాన్ తల్లి, అమ్మమ్మ అందరూ యునైటెడ్ స్టేట్స్‌కు వలస వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం జాన్ కౌమ్ జీవితాన్ని మార్చేసింది. 1992లో జాన్ ఫ్యామిలీ మెరుగైన జీవితాన్ని వెతుక్కుంటూ అమెరికాలోని కాలిఫోర్నియాలోని మౌంటెన్ వ్యూకి చేరుకున్నారు. ఇక్కడే స్థిరపడ్డారు.
ఫ్యామిలీ గడవడంకోసం జాన్ కిరాణా షాపులో క్లీనర్‌గా పనిచేశాడు. అతని తల్లి బేబీ సిటర్‌గా పనిచేసింది. ఎన్ని కష్టాలు వచ్చినా పట్టుదలతో జీవితంలో స్థిరపడాలని తల్లీకొడుకులు భావించారు. అయితే విధి వక్రీకరించింది గోరు చుట్టు మీద రోకలి పోటులా జాన్ తల్లికి క్యాన్సర్ సోకడంతో జాన్ ఫ్యామిలీ కష్టాలు మరింత పెరిగాయి.
అయినా జాన్ పట్టుదలతో చదువుకుంటూనే ఉన్నాడు. మరోవైపు కంప్యూటర్ నెట్‌వర్కింగ్ రంగంలో శిక్షణ శిక్షణ పొంది పని చేయడం మొదలు పెట్టాడు. శాన్ జోస్ స్టేట్ యూనివర్శిటీలో చేరాడు. చదువుకునే సమయంలో ఎర్నెస్ట్ & యంగ్ కోసం సెక్యూరిటీ టెస్టర్‌గా పనిచేశాడు. శాన్ జోస్ స్టేట్ యూనివర్శిటీలో చదువుకుంటూనే యాహూలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇంజనీర్‌గా ఎంపికయ్యాడు. దీంతో అతడిని అదృష్టం తలపు తట్టింది.
జనవరి 2009లో ఐఫోన్‌ను కొనుగోలు చేసిన జాన్ అందులో కొత్త యాప్‌లతో యాప్ స్టోర్ ఆవిర్భావాన్ని చూసింది. దీని ప్రేరణతో తన ఆలోచనను అలెక్స్ ఫిష్‌మన్ అనే స్నేహితుడితో పంచుకున్నాడు. తన పుట్టినరోజు, ఫిబ్రవరి 24, 2009న జాన్ కాలిఫోర్నియాలో “WhatsApp” పేరును రిజిస్టర్ చేయించాడు. అయితే మొదట్లో వాట్సాప్ సాంకేతిక సమస్యలు, అవాంతరాలను ఎదుర్కొంది. అయినప్పటికీ పట్టుదలతో ముందుకు అడుగు వేసి వాట్సాప్ ను సృష్టించాడు. తర్వాత ఈ యాప్ అత్యధికంగా ప్రజాదరణ పొందింది. 2011 నాటికి, ఇది Apple US యాప్ స్టోర్‌లో టాప్ 20 యాప్‌లలో ఒకటిగా నిలిచింది. రెండు సంవత్సరాలలో 50 మంది ఉద్యోగులకు నియమించింది. అదే సమయంలో యూజర్ బేస్ 200 మిలియన్ల మందిని అధిగమించింది.
2022 నాటికి, జాన్ నికర విలువ దాదాపు 1,420 కోట్ల రూపాయలుగా ఫోర్బ్స్ నివేదించింది. ప్రస్తుతం వాట్సాప్ మల్టీ-బిలియన్ డాలర్ల కంపెనీ. 2023లో 98.56 బిలియన్ డాలర్ల విలువను కలిగి ఉంది. జాన్ విజయగాథ నేటి యువతకి స్ఫూర్తిదాయకం.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.