Pakistan: ఆస్పత్రి సిబ్బంది కర్కశత్వం.. ప్రసవం కోసం వస్తే శిశువు తల కోసేశారు

పాకిస్తాన్(Pakistan) లో ఘోరం జరిగింది. పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ మహిళ పట్ల ఆస్పత్రి సిబ్బంది కర్కశంగా వ్యవహరించారు. డాక్టర్లు అందుబాటులోకి లేకపోవడంతో అనుభవం లేని సిబ్బందే ఆపరేషన్ చేశారు. సర్జరీ చేసే సమయంలో శిశువు...

Pakistan: ఆస్పత్రి సిబ్బంది కర్కశత్వం.. ప్రసవం కోసం వస్తే శిశువు తల కోసేశారు
Surgery
Follow us
Ganesh Mudavath

|

Updated on: Jun 21, 2022 | 9:46 PM

పాకిస్తాన్(Pakistan) లో ఘోరం జరిగింది. పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ మహిళ పట్ల ఆస్పత్రి సిబ్బంది కర్కశంగా వ్యవహరించారు. డాక్టర్లు అందుబాటులోకి లేకపోవడంతో అనుభవం లేని సిబ్బందే ఆపరేషన్ చేశారు. సర్జరీ చేసే సమయంలో శిశువు తల కోసేశారు. అంతే కాదు.. ఆ తలను మహిళ గర్భంలోనే ఉంచేశారు. ఈ ఘటనపై అధికారులు తీవ్రంగా స్పందించారు. విచారణకు ఆదేశించారు. పాకిస్తాన్ లోని సింధు ప్రావిన్స్(Sindh Pravince) థార్‌పార్కర్ జిల్లాకు చెందిన ఓ మహిళ కాన్పు కోసం ఆరోగ్య కేంద్రానికి వెళ్లింది. అయితే అక్కడ మ‌హిళా గైనకాల‌జీ వైద్యులు లేరు. సిబ్బందికి ఆపరేషన్ పట్ల అంతగా అనుభవం లేదు. మహిళకు సర్జరీ చేసి, శిశువును బయటకు తీసే స‌మ‌యంలో హెల్త్ సెంట‌ర్ సిబ్బంది స‌రైన రీతిలో ఆప‌రేష‌న్ చేయ‌లేక‌పోయారు. శిశువు త‌ల‌ను శరీరం నుంచి వేరుచేసారు. తలను గర్భంలోనే వదిలేశారు. మహిళ ప‌రిస్థితి విష‌మించ‌డంతో ఆమెను స‌మీపంలోని హాస్పిట‌ల్‌కు తీసుకువెళ్లారు. అక్కడ బాధితురాలికి డాక్టర్లు చికిత్స చేసి, గ‌ర్భంలో ఉన్న మిగతా శ‌రీరాన్ని బ‌య‌ట‌కు తీశారు. ఈ ఘటనలో మహిళ మూత్రాశ‌యం కూడా బాగా దెబ్బతిందని వైద్యులు చెప్పారు. ఈ ఘటనపై సింధు ఆరోగ్యశాఖ డీజీ డాక్టర్ జుమాన్ భాటో విచార‌ణ‌కు ఆదేశించారు. కాగా.. డెలివరీ కోసం వచ్చిన మహిళ హిందూ మతానికి చెందినట్లు తెలుస్తోంది.

ఈ విషాద ఘటనపై విచారణ చేసేందుకు ప్రభుత్వం వైద్య విచారణ బోర్డును ఏర్పాటు చేసింది. ఘటనకు గల కారణాలను తెలుసుకుని దోషులను శిక్షిస్తామని వెల్లడించారు. దీనిని చాలా తీవ్రంగా పరిగణిస్తామన్న అధికారులు ఈ కేసుపై వేర్వేరు విచారణలకు ఆదేశించారు. ముఖ్యంగా చచ్రోలోని ఆర్‌హెచ్‌సీలో గైనకాలజిస్టు, మహిళా సిబ్బంది లేకపోవడంతో ఏం జరిగిందో విచారణ కమిటీలు తేలుస్తాయని వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి