Sri Lanka President: నిరసనకారులు ఇంటిని చుట్టుముట్టడంతో పరారైన శ్రీలంక అధ్యక్షుడు
Sri Lanka President: శ్రీలంక ఆర్థిక సంక్షోభం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు రాజపక్స ఇంట్లోకి ఆందోళనకారులు దూసుకువచ్చారు. దీంతో పోలీసులు..
Sri Lanka President: శ్రీలంక ఆర్థిక సంక్షోభం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు రాజపక్స ఇంట్లోకి ఆందోళనకారులు దూసుకువచ్చారు. దీంతో పోలీసులు ఆందోళనకారులపై టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. అయినప్పటికీ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో లాఠీఛార్జీ చేశారు. ఈ ఘనటలో 26 మందికి గాయాలు కాగా, నలుగురు జవాన్లు కూడా గాయపడినట్లు తెలుస్తోంది.
ఆందోళనకారులు రాజపక్స నివాసాన్ని చుట్టుముట్టడంతో ఆయన వారి నుంచి ఇప్పించుకుని ఇంటి నుంచి పరారయ్యారు. అధ్యక్షుడు వెంటనే రాజీనామా చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను అక్కడి మీడియా ప్రసారం చేసింది. గత కొద్దినెలలోగా శ్రీలంక ఆర్థిక, రాజకీయ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది.
కాగా, శ్రీలంక ఆర్థిక సంక్షోభం నుంచి ఇంకా కోలుకోవడం లేదు. విదేశీ మారక ద్రవ్యం లేకపోవడంతో ఆ దేశ అవసరాలకు సరిపడే ఇంధనాన్ని కూడా అక్కడి సర్కార్ కొనుగోలు చేయలేకపోతోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో కొన్ని రంగాలకు అస్సలు ఇంధనాన్ని కేటాయించడం లేదు. ఈ ఇంధన సంక్షభ ప్రభావం ముఖ్యంగా విద్యా వ్యవస్థపై పడింది. జూలై 4వ తేదీ నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి