AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Elon Musk: ట్విట్టర్‌కు షాక్‌ ఇచ్చిన ఎలాన్‌ మస్క్‌.. కొనుగోలు డీల్‌ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన..

Elon Musk: టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ ట్విట్టర్‌కు షాక్‌ ఇచ్చారు. ట్విట్టర్‌ సంస్థను కొనుగోలు చేస్తున్నట్లు గత కొన్నిరోజులుగా ప్రకటనలు చేస్తూ వస్తోన్న మస్క్‌ ఇప్పుడు...

Elon Musk: ట్విట్టర్‌కు షాక్‌ ఇచ్చిన ఎలాన్‌ మస్క్‌.. కొనుగోలు డీల్‌ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన..
Narender Vaitla
|

Updated on: Jul 09, 2022 | 7:43 AM

Share

Elon Musk: టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ ట్విట్టర్‌కు షాక్‌ ఇచ్చారు. ట్విట్టర్‌ సంస్థను కొనుగోలు చేస్తున్నట్లు గత కొన్నిరోజులుగా ప్రకటనలు చేస్తూ వస్తోన్న మస్క్‌ ఇప్పుడు ఆ కొనుగోలు ఒప్పందం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. నకిలీ ట్విట్టర్‌ ఖాతాలకు సంబంధించి ట్విట్టర్‌ పూర్తి సమాచారం ఇవ్వలేదని, విలీన ఒప్పందలోని పలు నిబంధనలు సంస్థ ఉల్లంఘించందన్న కారణంతో కొనుగోలును రద్దు చేసుకుంటున్నట్లు మస్క్‌ తెలిపారు. ట్విట్టర్‌ చెప్పిన దానకంటే నకిలీ ఖాతాలు నాలుగింతలు ఉన్నాయని మస్క్‌ అభిప్రాయపడ్డారు.

ఇదిలా ఉంటే గడిచిన ఏప్రిల్‌లో ట్విట్టర్‌ కొనుగోలు చేసేందుకు మస్క్‌ 44 బిలియన్‌ డాలర్ల ప్రతిపాదనతో ముందుకు వచ్చాడు. అయితే స్పామ్‌, నకిలీ ఖాతాల గురించి సరైన సమాచారం ట్విటర్‌ ఇవ్వడం లేదని గత మే నెలలోలో ఈ డీల్‌ను ముందుకు వెళ్లకుండా మస్క్‌ తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక కొనుగోలు ఒప్పందంపై వెనక్కి తగ్గడాన్ని ట్విట్టర్ తీవ్రంగా పరిగణిస్తోంది. మస్క్‌పై చట్టపరమైన చర్యలకు సిద్ధమవుతోంది.

ఇవి కూడా చదవండి

మస్క్‌తో అంగీకరించిన ధర, నిబంధనల లావాదేవీలను కొనసాగించేందుకు ట్విట్టర్ బోర్డు కట్టుబడి ఉందని, విలీన ఒప్పందాన్ని అమలు చేయడానికి చట్టపరమైన చర్యలు కొనసాగించాలని బోర్డు యోచిస్తోందని ట్విట్టర్ చైర్మన్ బ్రెట్ టేలర్ ట్వీట్ చేశారు. మరి ఎలాన్‌ మస్క్‌ తీసుకున్న ఈ నిర్ణయం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.

మరిన్ని టెక్నాలజీ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
నేను, రజినీకాంత్ షూటింగ్‌లో ఒకటే సిగరెట్ కాల్చేవాళ్లం..
నేను, రజినీకాంత్ షూటింగ్‌లో ఒకటే సిగరెట్ కాల్చేవాళ్లం..
టీమిండియాలో వాడే యమ డేంజర్.. ఆ ఒక్కడి కోసం..
టీమిండియాలో వాడే యమ డేంజర్.. ఆ ఒక్కడి కోసం..
క్వీన్ ఎలిజబెత్ రాసిన లేఖ.. భారీ ధరకు వేలం..మ్యాటర్‌ ఏంటంటే..
క్వీన్ ఎలిజబెత్ రాసిన లేఖ.. భారీ ధరకు వేలం..మ్యాటర్‌ ఏంటంటే..
వంకాయ, టమాటా రోటి పచ్చడి ఇలా చేస్తే.. క్యాన్సర్‎ను తరిమికొడుతుంది
వంకాయ, టమాటా రోటి పచ్చడి ఇలా చేస్తే.. క్యాన్సర్‎ను తరిమికొడుతుంది
కన్నతల్లి కిరాతకం.. 2 నెలల బాబును నీటిలో ముంచి దారుణం.. చివరకు..
కన్నతల్లి కిరాతకం.. 2 నెలల బాబును నీటిలో ముంచి దారుణం.. చివరకు..
తిరుమల వెళ్తున్నారా..? రైల్వేశాఖ నుంచి శుభవార్త
తిరుమల వెళ్తున్నారా..? రైల్వేశాఖ నుంచి శుభవార్త
గంభీర్ లోని మరో కోణం..రింకూకు కోచ్ ఇచ్చిన భరోసా ఏంటంటే
గంభీర్ లోని మరో కోణం..రింకూకు కోచ్ ఇచ్చిన భరోసా ఏంటంటే
అసలైన పాములతో స్నేక్ అండ్ లాడర్ ఆడుతూ హల్‌చల్..షాకింగ్ వీడియో
అసలైన పాములతో స్నేక్ అండ్ లాడర్ ఆడుతూ హల్‌చల్..షాకింగ్ వీడియో
బెంగళూరు నుంచి తిరుమలకు వస్తుండగా ఊహించని ప్రమాదం.. ఐదుగురు మృతి
బెంగళూరు నుంచి తిరుమలకు వస్తుండగా ఊహించని ప్రమాదం.. ఐదుగురు మృతి
తెలంగాణలో వారికి ఫ్రీ బస్ స్కీమ్.. అసలు నిజం ఏంటంటే..?
తెలంగాణలో వారికి ఫ్రీ బస్ స్కీమ్.. అసలు నిజం ఏంటంటే..?